Fake Passport Scam: నకిలీ పాస్ పోర్టు స్కామ్ తెలంగాణ రాష్ట్రంలోనే కలకలం సృష్టిస్తుంది. నకిలీ పాస్ పోర్టు స్కామ్ కేసును అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద మొత్తంలో శ్రీలంకకి నకిలీ పాస్ పోర్టు తీసుకుని వెళ్లినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్టు కేంద్రంగా 92 జారీ అయినట్లు గుర్తించారు. కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసిన సిఐడి.. మరికొందరు కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఏజెంట్ మురళీధరన్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. మురళీధర్ ద్వారా పాస్ పోర్ట్ స్కాం జరిగినట్లు సీఐడీ గుర్తించింది.
Read also: Challa Vamshi Reddy: డీకే.అరుణ నా ఫోన్ లిప్ట్ చేయలేదు.. చల్లా సంచలన వ్యాఖ్యలు
పాస్ పోర్ట్స్ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్ తెలిపారు. ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసామన్నారు. తమిళనాడు స్టేట్ చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్, ద్వారా నకిలీ పాస్ పోర్ట్ రాకెట్ గుర్తించామన్నారు. శ్రీలంక దేశస్తులు ఎక్కవ మంది అడ్డదారిలో పాస్పోర్ట్స్ పొందారని తెలిపారు. ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టమని, తమిళనాడు ఏజెంట్ మురళీధరన్, హైదరాబాద్ చెందిన సత్తార్ నకిలీ పత్రలు సృష్టించి హైదరాబాద్ కి పంపారని తెలిపారు. వివిధ జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్ లతో పాటు తమిళనాడు మెయిన్ బ్రోకర్ అదుపులోకి తీసుకున్నామన్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్ట్ పొందినట్లు గుర్తించామని తెలిపారు.
Read also: Fake Social Media Profile: రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు.. సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్
కొందరు విదేశీయులకు నకిలీ ఐడి ప్రూఫ్ పెట్టి పాస్ పోర్ట్ ఇప్పించినట్లు గుర్తించామని అన్నారు. 92 మంది పాస్పోర్టులు గుర్తించాము ఇందులో కొంతమంది తీసుకొని విదేశాలకు వెళ్లిపోయారని తెలిపారు. పాస్ పోర్ట్ పొందిన వారిలో ఎక్కువగా శ్రీలంక దేశానికి చెందిన వారు ఉన్నట్టు గుర్తించామన్నారు. పాస్ పోర్ట్ లు ఇప్పించడంలో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల హస్తం ఉన్నట్టుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసామని తెలిపారు. పలువురు ఎస్బి, పాస్పోర్ట్ సిబ్బంది పాత్ర పై ఆరా తీస్తున్నమని తెలిపారు. 92 మందికి నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందినట్టు గుర్తించామని అన్నారు. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ కేంద్రంగా 92 నకిలీ పాస్ పోర్ట్ జారీ అయ్యాయని తెలిపారు. 12 మంది నిందితులను ఐదు రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిందని, పాస్పోర్ట్ స్కామ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
Rohit Sharma: కెరీర్‌లో ఏనాడూ ఎన్‌సీఏకు వెళ్లలేదు.. విరాట్ కోహ్లీని చూసి యువ క్రికెటర్లు నేర్చుకోవాలి: రోహిత్