Chicken Price Effect: బైక్ పై వచ్చి కోళ్ళు కొట్టేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఆకాశాన్నంటిన చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనలేరు.. తినకుండా వుండలేరు. బంగారం దొంగతనం చూశాం, డబ్బులు దొంగతనం చూశాం, విలువైన వస్తువులు కోసం దొంగతనాలు చూశాం. కానీ చికెన్ రేట్లు పెరగడంతో కోళ్ల దొంగతనం చేసిన ముగ్గురు యువకుల కథ ఇది. బైక్ పై వచ్చి దర్జాగా దొంగతనం చేసుకొని ఉడాయించారు. గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగులు రాత్రి సమయంలో చికెన్ దుకాణాలను టార్గెట్ చేశారు. చికెన్ సెంటర్ ముందు చిన్న షెడ్డులో దాచి ఉంచిన బ్రాయిలర్ కోళ్లను తాళం పగలగొట్టి మరీ ఎత్తుకెళ్ళిపోయారు.
ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరగడం విశేషం. బాలబోయిన వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సాయికృష్ణ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లో ఎలాంటి దొంగతనాలు జరగకపోవటంతో ఎప్పటిలాగే షాపు ముందు ఉన్న దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
గత రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణంలో ఉన్న బ్రాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన షాపు యజమాని వెంకన్న ఇనుప జాలీలో ఉన్న కోళ్లు లేకపోవటంతో బిత్తరపోయాడు. దీంతో వెంటనే సీసీ పుటేజ్ చూసి చోరీ జరిగినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గత కొంతకాలంగా చికెన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!