Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- యాపిల్ కొత్త తరం స్మార్ట్ స్పీకర్ HomePod Mini 2 లాంచ్
- మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు ఆల్బమ్ ఆర్ట్‌కు అనుగుణంగా ప్యానెల్ రంగు మారే కొత్త Sound Glow ఫీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple HomePod Mini 2: ఆపిల్ (Apple) కొత్త HomePod Mini 2 స్మార్ట్ స్పీకర్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఒరిజినల్ HomePod Miniలోని గోళాకార (Spherical) డిజైన్‌ను కొనసాగిస్తూనే.. ఇందులో ఇంటర్నల్ హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. అలాగే టాప్ ప్యానెల్లో కొత్త లైటింగ్ ఎఫెక్ట్, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న Siri AI ఫీచర్లను జోడించింది. దీని ధర 149 డాలర్లుగా నిర్ణయించింది. అంటే గత మోడల్‌తో పోలిస్తే 50 డాలర్లు ఎక్కువ.
ఈ HomePod Mini 2లో అప్‌గ్రేడ్ చేసిన Siri AI సపోర్ట్ ఉంటుంది. అయితే లాంచ్ సమయంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా అందించనున్నట్లు ఆపిల్ తెలిపింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత Siriతో మరింత సహజంగా సంభాషించడంతో పాటు క్లిష్టమైన ప్రశ్నలు, అభ్యర్థనలకు కూడా సమాధానాలు పొందవచ్చు. Apple Intelligenceకు సపోర్ట్ చేసే ఐఫోన్, ఐప్యాడ్లతో HomePod Mini 2ను కనెక్ట్ చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని కూడా Siri ఉపయోగించుకోగలదు. ఉదాహరణకు ఈమెయిల్లో ఎవరైనా పంపిన రెసిపీని వెతకమని లేదా మెసేజ్‌లో వచ్చిన పాటను ప్లే చేయమని Siriని అడగవచ్చు.
Also Read
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- 7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
- ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
వినియోగదారుల వ్యక్తిగత డేటాను రక్షించేందుకు ఆన్-డివైజ్ ప్రాసెసింగ్ లేదా Apple Private Cloud Compute వ్యవస్థను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. Apple Intelligenceకు అనుకూలమైన ఐఫోన్, ఐప్యాడ్ లేని వారికి కూడా మెరుగైన సంభాషణ సామర్థ్యాలు అందుతాయి. అయితే వ్యక్తిగత సందర్భానికి సంబంధించిన ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉండవు. ఇక ఇందులో S10 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. వాల్యూమ్, డైనమిక్ రేంజ్ వంటి ఆడియో అంశాలను రియల్ టైమ్‌లో సర్దుబాటు చేయడంలో ఈ చిప్ కీలకంగా పనిచేస్తుందని ఆపిల్ చెబుతోంది. సింగిల్ స్పీకర్‌గా లేదా స్టీరియో పెయిర్‌గా ఉపయోగించుకునే సదుపాయం కొనసాగుతుంది.
అయితే ఇప్పుడు కొత్త హోమ్ థియేటర్ సెటప్ కూడా అందుబాటులోకి వచ్చింది. కొత్త 4వ తరం Apple TV 4K ఉన్నవారు నాలుగు HomePod స్పీకర్లను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. గదిలో స్పీకర్లు ఎక్కడ అమర్చారో గుర్తించి సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆడియోను క్యాలిబ్రేట్ చేస్తుంది. అలాగే HomePod Mini 2ను Macకు డిఫాల్ట్ ఆడియో అవుట్‌పుట్‌గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక దీని పైభాగంలోని టచ్ ప్యానెల్‌ను కూడా రీడిజైన్ చేశారు. Sound Glow అనే కొత్త ఫీచర్ ఇందులో ఉంది. సాధారణ Siri యానిమేషన్‌కు బదులుగా.. మీరు ప్లే చేస్తున్న పాట ఆల్బమ్ ఆర్ట్‌కు అనుగుణంగా టాప్ ప్యానెల్ రంగు మారుతుంది. అంతేకాకుండా మ్యూజిక్కు అనుగుణంగా లైట్ పల్స్ అవుతుంది.
HomePod Mini 2ను స్మార్ట్ హోమ్ హబ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులోని సౌండ్ రికగ్నిషన్ ఫీచర్ పొగ లేదా కార్బన్ మోనాక్సైడ్ అలారాలను గుర్తించి మీ ఫోన్‌కు అలర్ట్ పంపగలదు. అలాగే ఆపిల్ కొత్తగా ప్రకటించిన Home Collection వీడియో డోర్బెల్స్తో ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ పనిచేస్తుంది. ఇది పింక్, గ్రీన్, బ్లూ, వైట్, మిడ్నైట్ కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 30 నుంచి స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దీని ధర 149 డాలర్స్ గా ఉంది.
తాజావార్తలు
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!