ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఆకాశాన్నంటిన చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనలేరు.. తినకుండా వుండలేరు. బంగారం దొంగతనం చూశాం, డబ్బులు దొంగతనం చూశాం, విలువైన వస్తువులు కోసం దొంగతనాలు చూశాం. కానీ చికెన్ రేట్లు పెరగడంతో కోళ్ల దొంగతనం చేసిన ముగ్గురు యువకుల కథ ఇది. బైక్ పై వచ్చి దర్జాగా దొంగతనం చేసుకొని ఉడాయించారు. గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగులు రాత్రి సమయంలో చికెన్ దుకాణాలను టార్గెట్ చేశారు.…