Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సంబంధించి కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టును గోషామహల్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ తన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ ద్వారా ‘నాట్ ఫర్ సేల్’ పాస్‌లను ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. హెచ్‌సీఏ (HCA) మెంబర్ ద్వారా కాంప్లిమెంటరీ టికెట్లు సేకరించి బ్లాక్‌లో విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బేగంబజార్‌లోని ఎస్డీ మాల్ సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సతీష్ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అవినాష్ దరక్, మోహిత్ సోమానీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 మ్యాచ్ టికెట్లు, 8 దాండియా పాస్‌లు, నగదు, ఓ స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నేడు నాల్గో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటర్లదే ఆధిపత్యం ఉండగా, ఉప్పల్ పిచ్‌ను కొత్త మట్టితో పునరుద్ధరించడం వల్ల బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సి రావచ్చు. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా ఐదో సిరీస్ విజయంపై కన్నేసింది. భారత జట్టులో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలకు స్థానిక పిచ్‌పై మంచి అవగాహన ఉండటం అదనపు బలం కాగా, పేసర్ మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ విండీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు. విండీస్‌లో పవర్ హిట్టర్లు ఉన్నప్పటికీ, సొంతగడ్డపై ఆడుతున్న భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టాస్, మంచు ప్రభావం ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ భారత్ భారీ స్కోరు సాధించిన జ్ఞాపకాలు ఉండటంతో, నేడు కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది.
Also Read
- AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
- చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
- Kavya-Anirudh Reception: సింధూరం లేదు.. మెహందీ లేదు.. కావ్య మారన్ రిసెప్షన్ స్టైల్‌పై నెటిజన్ల చర్చ!!
- HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
తాజావార్తలు
-
IPL 2027-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
-
AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
Kavya-Anirudh Reception: సింధూరం లేదు.. మెహందీ లేదు.. కావ్య మారన్ రిసెప్షన్ స్టైల్‌పై నెటిజన్ల చర్చ!!
-
HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం