Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushila Devi Inspirational Story: వయసు కేవలం నెంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించారు హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా దేవ్‌నగర్ గ్రామానికి చెందిన 63 ఏళ్ల సుశీలా దేవి. సర్పంచ్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా పదో తరగతిలో 79.6 శాతం మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నతనంలో కుటుంబ పరిస్థితుల కారణంగా కేవలం ఐదో తరగతి వరకే చదువుకోగలిగినప్పటికీ, చదువుపై ఆమెకున్న మమకారం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. పెళ్లి తర్వాత కూడా రోజూ పేపర్లు చదువుతూ, కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎప్పుడూ ముందుండేవారు.
ఈ క్రమంలోనే సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అర్హత సాధించాలనే ఆలోచనతో ఆమె తన చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తల్లి పడుతున్న తపనను గమనించిన కుమారుడు విష్ణు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా పదో తరగతికి దరఖాస్తు చేయించాడు. మొదట్లో సబ్జెక్టులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టినప్పటికీ, పిల్లల సహకారంతో ఆమె రోజుకు 3 నుంచి 4 గంటలు శ్రద్ధగా చదివారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా పట్టుదలగా కష్టపడ్డారు. ఏప్రిల్ 2026లో జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఇటీవల వెలువడగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుశీలా దేవి అద్భుతమైన విజయం సాధించారు. మొత్తం 79.6 శాతం మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నారు. సబ్జెక్టుల వారీగా చూస్తే ఇంగ్లీష్‌లో 89, సైన్స్ అండ్ టెక్నాలజీలో 88, మ్యాథ్స్‌లో 78, పెయింటింగ్‌లో 76, హిందీలో 67 మార్కులు సంపాదించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ అద్భుత విజయం తర్వాత యువతకు, మహిళలకు ఆమె ఒకటే మాట చెబుతున్నారు. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని, నేర్చుకోవాలనే తపన ఉంటే కుటుంబం సహకారంతో ఏ లక్ష్యానైనా సులభంగా సాధించవచ్చని నిరూపించి చూపించారు.
Also Read
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!