21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Top 10 Bowlers Of 21st Century: 21వ శతాబ్దంలో అత్యుత్తమ బౌలర్లు ఎవరు?.. ఈ ప్రశ్నకు ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్, మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తమదైన శైలిలో సమాధానమిచ్చారు. వీరిద్దరూ కలిసి నిర్వహిస్తున్న ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో ఈ శతాబ్దపు టాప్-10 బౌలర్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడో స్థానం దక్కింది. ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజాల కంటే.. బుమ్రా ముందుండం విశేషం.
టాప్ ప్లేస్‌లో షేన్ వార్న్:
ఆస్ట్రేలియా దివంగత లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు ఈ జాబితాలో మొదటి స్థానంను జోస్ బట్లర్, స్టువర్ట్ బ్రాడ్ కేటాయించారు. అంతర్జాతీయ కెరీర్లో వార్న్ 1,001 వికెట్లు పడగొట్టాడు. 1999లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్ల మైలురాయిని అందుకున్న ఇద్దరు బౌలర్లలో వార్న్ ఒకడు. మరో బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు రెండో స్థానం దక్కింది. ఇంగ్లండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌గా ఆండర్సన్ గుర్తింపు పొందాడు. అతడి ఖాతాలో 991 వికెట్లు ఉన్నాయి. స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి ఆండర్సన్ ఎన్నో ఏళ్లపాటు ఇంగ్లండ్ పేస్ బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు.
Also Read
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
- Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
బుమ్రాకు మూడో స్థానం:
భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా.. మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అద్భుత ప్రదర్శనలు చేయడంతో పాటు స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపైనా వికెట్లు తీయగల సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. బుమ్రా 243 మ్యాచ్‌ల్లో 511 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో 18 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజయాల్లోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును అందుకున్నాడు.
మెక్‌గ్రాత్, మురళీధరన్‌కు ఏ స్థానాలంటే?:
ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు నాలుగో స్థానం కేటాయించారు. మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడైన మెక్‌గ్రాత్.. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లలో అతడి ఖాతాలో 71 వికెట్లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో 376 మ్యాచ్‌ల్లో 949 వికెట్లు పడగొట్టాడు. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. ఆస్ట్రేలియాకు 2023 వన్డే ప్రపంచకప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిళ్లు అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో కమిన్స్ 535 వికెట్లు సాధించాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు ఆరో స్థానం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 1,347 వికెట్లు తీసిన బౌలర్‌గా మురళీధరన్ రికార్డు సృష్టించాడు. 1996 ప్రపంచకప్, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన శ్రీలంక జట్లలో అతడు సభ్యుడు.
టాప్-10లో దక్షిణాఫ్రికా బౌలర్లు:
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఏడో స్థానంలో నిలిచాడు. అతడి ఖాతాలో 699 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. మరో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా ఎనిమిదో స్థానాన్ని దక్కించుకోగా.. షాన్ పొలాక్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. రబడా 631 వికెట్లు సాధించగా, పొలాక్ అంతర్జాతీయ కెరీర్లో 823 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌కు పదో స్థానం దక్కింది. రెండు వన్డే ప్రపంచకప్‌లు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన జట్లలో స్టార్క్ సభ్యుడు. అతడి ఖాతాలో 773 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి.
టాప్-10 జాబితాలో చోటు దక్కని దిగ్గజాలు:
బట్లర్, బ్రాడ్ ఎంపిక చేసిన జాబితాలో భారత స్పిన్ దిగ్గజాలు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లేలకు చోటు దక్కలేదు. అలాగే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఈ జాబితాలో లేరు. వీరు కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో వికెట్లు తీసిన ప్రముఖ బౌలర్లు కావడంతో.. ఈ ఎంపికపై అభిమానులు చర్చిస్తున్నారు.
బట్లర్, బ్రాడ్ ఎంపిక చేసిన టాప్-10 బౌలర్లు
టాప్-10 బౌలర్లు:
షేన్ వార్న్ – ఆస్ట్రేలియా
జేమ్స్ ఆండర్సన్ – ఇంగ్లండ్
జస్ప్రీత్ బుమ్రా – భారత్
గ్లెన్ మెక్‌గ్రాత్ – ఆస్ట్రేలియా
ప్యాట్ కమిన్స్ – ఆస్ట్రేలియా
ముత్తయ్య మురళీధరన్ – శ్రీలంక
డేల్ స్టెయిన్ – దక్షిణాఫ్రికా
కగిసో రబడా – దక్షిణాఫ్రికా
షాన్ పొలాక్ – దక్షిణాఫ్రికా
మిచెల్ స్టార్క్ – ఆస్ట్రేలియా
తాజావార్తలు
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!