VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ (వీబీ-జీరాంజీ) పథకంలో పనిచేస్తున్న దాదాపు 3,800 మంది ఫిక్స్డ్ టెన్యూర్ (ఎఫ్‌టీఈ) ఉద్యోగులకు తీపి కబురు అందించింది. దసరా పండుగ కానుకగా వీరికి గ్రాట్యుటీ సౌకర్యాన్ని కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 548 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఉద్యోగులు దాదాపు 20 ఏళ్లుగా చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది.
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో సర్వీసు ప్రాతిపదికన రూ. 4 లక్షల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. పదేళ్లకు పైగా పనిచేసిన వారికి రూ. 10 లక్షల వరకు గ్రాట్యుటీ మంజూరవుతుంది. ఈ పథకం అమలు కోసం నెలకు అవసరమయ్యే రూ. కోటి నిధులను ఉపాధి పథకం నుంచే చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను పరిష్కరించడంపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.
Also Read
- Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
- YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
- BJP vs Congress: సిక్కు వ్యతిరేక అల్లర్ల రోజే ర్యాలీ ఎందుకు.? రాహుల్‌ను ప్రశ్నించిన జేపీ నడ్డా!
- Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
దీంతోపాటు రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక సహాయాన్ని పెంపొందించాలని నిశ్చయించింది. ప్రస్తుతం ఎల్-నినో ప్రభావం వల్ల రోజూ లక్షలాది మంది కూలీలు పనులకు వస్తుండటంతో, వారి సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో ఉద్యోగులకు ఆధునిక సాధనాలు అందించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 7,612 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు స్మార్ట్ఫోన్లు, అలాగే 2,172 మంది టెక్నికల్ అసిస్టెంట్లకు ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ సంబంధిత పత్రాలపై సంతకం చేశారు. ప్రభుత్వ ఈ రెండు నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు ఉపాధి హామీ పథకం అమలులో పనితీరును మరింత మెరుగుపరచడానికి దోహదపడతాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
-
BJP vs Congress: సిక్కు వ్యతిరేక అల్లర్ల రోజే ర్యాలీ ఎందుకు.? రాహుల్‌ను ప్రశ్నించిన జేపీ నడ్డా!
-
Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!