BRS Chalo Medigadda: నేడే చలో మేడిగడ్డ.. సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నేడు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను సందర్శించి సమీక్షలు నిర్వహించి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే.. బీఆర్ఎస్ పర్యటనకు కూడా పిలుపునిచ్చారు. మార్చి 1న మేడిగడ్డకు.. నేడు ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డనే కాదు, ఇతర బ్యారేజీలు, పంపుహౌజ్‌లు అంటూ కాంగ్రెస్ మాటలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ నేతలతో బయలుదేరి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజా ప్రతినిధులు. చలో మేడిగడ్డ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ దిశానిర్దేశం చేశారు.
Read also: Sreeleela: సినిమాలకు బ్రేక్ తీసుకోనున్న శ్రీలీలా..ఎందుకంటే?
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తెలిసీ మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టును సజీవంగా చూపిస్తామని, అందుకే చలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కాళేశ్వరం కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు మూడు బ్యారేజీల సమాహారం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల ఫ్లో కెనాల్స్ ఉన్నాయన్నారు. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 240 టీఎంసీల వినియోగం అని, వీటన్నింటికీ సమగ్ర రూపమే కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. చలో మేడిగడ్డ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నుంచి భూపాలపల్లి వరకు కొనసాగుతుందని కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఉదయం కరుణాపురం, ఆరెపల్లి, గూడెప్పాడు, పరకాల, భూపాలపల్లి మీదుగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ రింగ్‌రోడ్డు మీదుగా మేడిగడ్డ వరకు కొనసాగుతామని బీఆర్ఎస్ ప్రతినిధులు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝాకు వినతిపత్రం సమర్పించారు. సమగ్ర భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!