Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
- కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు
- బీజేపీ ఎంపీకి కృతి సనన్ కౌంటర్
- ఆమె ఇష్టమంటూ రాహుల్‌గాంధీ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్షాబంధన్ సందర్భంగా బాలీవుడ్ నటి కృతి సనన్ చేసిన యాడ్ తీవ్ర దుమారం రేపుతోంది. యాడ్‌లో కృతి సనన్ వస్త్రధారణపై బాలీవుడ్ నటి, బీజేపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. యాడ్‌లో కృతి ధరించిన దుస్తులు “ఉద్దేశపూర్వకంగా అసహజంగా” ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దీనికి కృతి సనన్‌ను కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
కృతి సనన్ కౌంటర్
మహిళలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని వారి దుస్తులను బట్టి ఎందుకు నిర్ణయిస్తున్నారని కృతి సనన్ ప్రశ్నించారు. సంస్కృతి, సంప్రదాయాలు హృదయంలో ఉంటాయని.. నెక్‌లైన్‌లో కాదన్నారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం మనం ఎప్పుడు ఆపుతాం? అని కృతి సనన్ కౌంటర్ ఇచ్చారు. రక్షాబంధన్ తనకు, తన సోదరికి ఎంతో ప్రత్యేకమైనదని కృతి తెలిపారు. ఈ పండుగ కేవలం సోదరుడు-సోదరి మధ్య రక్షణ బంధానికే పరిమితం కాదని.. తాను, తన సోదరి ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని చెప్పారు. సోదరుడు ఎంతగా రక్షించగలడో.. తాము కూడా ఒకరినొకరు అంతే రక్షించుకోగలమని పేర్కొన్నారు. తమ పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులేనని తెలిపారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
రాహుల్ మద్దతు..
వివాదం నడుస్తున్న వేళ కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కృతి సనన్‌కు మద్దతు తెలిపారు. మహిళలు ఏం ధరించాలి.. ఎలా జీవించాలి అనే నిర్ణయం పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహిళల స్వేచ్ఛను ప్రశ్నిస్తూ వారిని ఆన్లైన్లో ట్రోల్ చేయడం ఆపాలని సూచించారు.
యాడ్ ఇదే..
కృతి సనన్ రక్షాబంధన్ సందర్భంగా ఓ ప్రముఖ నగల బ్రాండ్ కోసం చేసిన ప్రకటన ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ యాడ్‌లో కృతి ఐవరీ రంగు బ్రాలెట్, స్కర్ట్‌తో పాటు కేప్ ధరించి కనిపించారు. తన సోదరుడికి రాఖీ కడుతున్నట్లు ప్రకటనలో చూపించారు. వారి పెంపుడు కుక్క కూడా యాడ్‌లో కనిపించింది.
ఈ ప్రకటనపై కొందరు సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృతి ధరించిన దుస్తులపై విమర్శలు రావడంతో పాటు.. ఆమె తన పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టడాన్ని కొందరు తప్పుబట్టారు. దీంతో ఈ వివాదం క్రమంగా మహిళల దుస్తులు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల సమయంలో మహిళలు ఎలా ఉండాలనే అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది.
తాజాగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కృతికి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడంతో రాజకీయ చర్చగా మారింది. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే. తమ జీవితంపై స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కును గౌరవించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్పందనపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!