Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- టిన్ షెడ్లో భారీ అక్రమ తయారీ
- 40 ప్యాకింగ్ మెషీన్లు సీజ్
- రూ.160 కోట్ల పన్ను ఎగవేత గుట్టురట్టు
- కీలక నిందితుడి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్ శివార్లలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక భారీ పాన్ మసాలా, పొగాకు అక్రమ తయారీ కేంద్రాన్ని సెంట్రల్ జిఎస్టి (CGST) హైదరాబాద్ జోన్ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం ఛేదించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఒక నిర్జన ప్రాంతంలో పెద్ద టిన్ షెడ్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ తయారీ యూనిట్‌పై దాడి చేసి కోట్ల రూపాయల విలువైన సరుకుతో పాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
టిన్ షెడ్లో తయారీ.. 40 ప్యాకింగ్ యంత్రాలు స్వాధీనం
మేడ్చల్-మల్కాజ్గిరి పరిధిలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌లో పాన్ మసాలా, సెంటెడ్ జర్దా (పొగాకు) తయారు చేయడానికి సుమారు 56 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడి సమయంలో సరుకును ప్యాక్ చేసేందుకు ఉపయోగిస్తున్న 40 అక్రమ ఎఫ్ఎఫ్ఎస్ (FFS) పౌచ్ ప్యాకింగ్ మెషీన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 5,500 కిలోల ఫినిష్డ్ స్టాక్, రూ. 76 లక్షల విలువైన రెడీ-టు-డిస్పాచ్ సరుకును సీజ్ చేశారు. వీటితో పాటు తయారీకి సిద్ధంగా ఉన్న 2,015 కిలోల పాన్ మసాలా మిశ్రమం, 810 కిలోలRaw పొగాకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
- Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
- Koti Deepotsavam 2026: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం.. మూడో రోజు విశేష కార్యక్రమాలు ఇవే..!
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
రూ.160 కోట్ల GST, సెజ్ ఎగవేత.. ప్యాకింగ్ మెటీరియల్, వాహనాలు సీజ్
ప్రభుత్వానికి చెల్లించాల్సిన జిఎస్టి (GST), హెచ్ఎస్ఎన్ఎస్ (HSNS) సెస్‌లతో పాటు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఎగ్గొట్టి ఈ సరుకును మార్కెట్లోకి విక్రయిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ అక్రమ తయారీ, దొంగతనంగా సరుకు తరలింపుల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.160 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సరుకు రవాణాకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలను, భారీ స్థాయిలో ఉన్న ప్యాకింగ్ మెటీరియల్‌ను, పలు కీలక పత్రాలను సీజీఎస్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సూత్రధారి అరెస్ట్.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ఈ అక్రమ తయారీ కేంద్రాన్ని వెనుక ఉండి నడిపిస్తున్న కీలక నిర్వాహకుడిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కుంభకోణంలో మరికొంతమంది భాగస్వాములు ఉండే అవకాశం ఉందనే కోణంలో సీజీఎస్టీ అధికారులు విచారణను వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
-
The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
-
UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!