IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
- ఆవు కడుపులోని ఎంజైమ్‌తో మొండి బ్యాక్టీరియాలకు చెక్..
- బెంగళూర్ IISc సైంటిస్టుల అద్భుత పరిశోధన..
- బ్యాక్టీరియా రక్షణ కవచాన్ని దెబ్బతీసే ఎంజైమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IISc Study: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తలు పరిశోధన సంచలనంగా మారింది. యాంటీబయాటిక్ నిరోధక ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో బెంగళూర్ IISc సైంటిస్టులు కీలక విషయాన్ని కనుగొన్నారు. ‘‘ఆవు’’ జీర్ణాశయంలో సూక్ష్మజీవుల నుంచి గుర్తించిన ఒక ఎంజైమ్ ప్రపంచంలోనే ప్రమాదకరమైన హాస్పిటల్ సూపర్‌బగ్‌గా ఉన్న అసినెటోబాక్టర్ బౌమానీ (Acinetobacter baumannii) రక్షణ కవచాన్ని బలహీనపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ పరిశోధన ప్రస్తుతం ప్రాథమిక శాస్త్రీయ దశలోనే ఉంది. ఇది చికిత్సకు అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా ఏళ్ల పరిశోధనలు అవసరం. ఈ పరిశోధన మందులకు లొంగని ప్రమాదకర బ్యాక్టీరియాపై పోరాటంలో కొత్త మార్గాన్ని చూపించింది. సినెటోబాక్టర్ బౌమానీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న బ్యాక్టీరియా ఇరాక్ యుద్ధ సమయంలో గాయపడిన సైనికుల్లో ఇన్ఫెక్షన్లకు కారణమైంది. దీంతో దీనికి ‘‘ఇరాకీబాక్టర్’’ అనే పేరు కూడా వచ్చింది.
ఎందుకు ప్రమాదకరం..
అమెరికాకు చెందిన సెంటర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ప్రకారం.. ఈ బ్యాక్టీరియా సాధారణంగా నేల, నీటిలో కనిపిస్తుంది. అయితే మనుషుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ప్రధానంగా ఆస్పత్రి వాతావరణంలో ఏర్పడుతాయి. ఇది లంగ్స్, గాయాలు, రక్తప్రవాహం, మూత్ర నాళాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
Also Read
ఈ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు తట్టుకునే సామర్థ్యం ఉంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని క్రిటికల్ ప్రైయారిటీ పాథోజెన్గా గుర్తించింది. ఐఐఎస్సీ సైంటిస్టులు, బ్యాక్టీరియా నేరుగా చంపే ప్రయత్నం చేయకుండా దానికి రక్షణగా ఉండే బయోఫిల్మ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుందని చెబుతున్నారు. కొన్ని బ్యాక్టీరియా తమ చుట్టూ చక్కెరలు, ప్రొటీన్లు, కొవ్వులు, DNAతో కూడిన అంటుకునే రక్షణ పొరను ఏర్పరుచుకుంటాయి. దీనినే బయోఫిల్మ్ అంటారు. ఇది బ్యాక్టీరియాకు ఒక రకమైన కవచంలా పనిచేస్తుంది. దీంతో యాంటీబయాటిక్స్, శరీరంలోని రోగనిరోధక కణాలు లోపల ఉన్న బ్యాక్టీరియాను సులభంగా చేరుకోలేవు. పాలిసాకరైడ్లు అనే సంక్లిష్ట చక్కెరలు బ్యాక్టీరియా బయోఫిల్మ్ లో ప్రధాన భాగంగా ఉంటాయి.
ఆవు జీర్ణాశయ ఎంజైమ్‌తో పరిష్కారం..
ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియాను దెబ్బతీసేలా ఆవు జీర్ణాశయంలోని రూమెన్ అనే పదార్థం. పీచు అధికంగా ఉండే మొక్కలను జీర్ణం చేసుకోవడానికి సహాయడపే అనేక సూక్ష్మజీవులు ఇందులో ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల జన్యు సమాచారాన్ని ఉపయోగించి, సంక్లిష్ట పాలిసాకరైడ్లను విచ్ఛిన్నం చేయగల ఎంజైమ్‌ల కోసం పరిశోధకులు అన్వేషించారు. ఇందులో CRhAB అనే ఎంజైమ్ బ్యాక్టీరియా బయో ఫిల్మ్‌ను ఏర్పరచడాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అప్పటికే ఉన్న బయోఫిల్మ్‌ను విచ్ఛిన్నం చేయగలదని తేలింది. బ్యాక్టీరియాలను నేరుగా ఎటాక్ చేయకుండా దాని రక్షణ కవచాన్ని దెబ్బతీయడం వల్ల ఇప్పటికే ఉన్న యాంటీబయాటిక్స్ కవచాన్ని దాటి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసే శక్తిని కల్పిస్తుంది.
CRhAB మరో ప్రమాదకరమైన బ్యాక్టీరియాపై కూడా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. క్లెబ్సియెల్లా న్యుమోనియా(Klebsiella pneumoniae ) అనే మల్టీడ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియాపై కూడా ఈ ఎంజైమ్ ప్రభావం చూపింది.IISc ప్రొఫెసర్ దీపశిఖా చక్రవర్తి మాట్లాడుతూ.. రెండు ప్రధాన సూపర్‌బగ్‌లు తయారు చేసే బయోఫిల్మ్లపై ఒకే ఎంజైమ్ పనిచేయడం ఈ పరిశోధన ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!