Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- పర్యటన రద్దుపై రాజకీయ దుమారం
- అనుమతులు నిరాకరించడం కొత్త కాదన్న కిషన్ రెడ్డి
- రేవంత్‌పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
- విదేశీ టూర్‌పై కాంగ్రెస్-బీజేపీ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పర్యటనకు అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. విదేశీ పర్యటనలకు అనుమతులు నిరాకరించడం అనేది కేవలం ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నిబంధనలు కొత్తవి కావు.. కాంగ్రెస్ హయాం నుంచే ఉన్నాయి
కేంద్రమంత్రులు లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారిక విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు విదేశాంగ శాఖ అనుమతి తీసుకోక తప్పదని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విదేశాంగ నియమావళి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, గతంలో కాంగ్రెస్ హయాం నుంచే అమల్లో ఉందని గుర్తుచేశారు. గతంలో 2005లో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో రేవంత్ రెడ్డి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లేందుకు, ఆ తర్వాత లండన్ పర్యటనలకు కేంద్రమే అనుమతులు ఇచ్చిందని, కాబట్టి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
అర్హత లేని వ్యక్తులను కలిసేందుకు ప్రయత్నం?
ముఖ్యమంత్రి పర్యటనల విషయంలో అధికారులు అనేక అంశాలను సేకరించి, ఆయా సమావేశాల్లో పాల్గొనే వ్యక్తుల స్థాయి, వారి బ్యాక్‌గ్రౌండ్ , దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటారని విశ్లేషించారు. రేవంత్ రెడ్డి తన హోదాకు తగిన వ్యక్తులను కాకుండా అర్హత లేని వారిని కలవాలని నిర్ణయించుకున్నారని ఆరోపించారు. భారత ప్రధానిని ఉగ్రవాదితో పోల్చి, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలవడానికి సీఎం ప్రయత్నించారని, దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రులకు కూడా పర్యటనలు నిరాకరిస్తారు
విదేశాంగ విధానాలు, క్లియరెన్సులు లభించకపోవడం వంటి సాధారణ సాంకేతిక కారణాల వల్ల గతంలో తాను కెనడా, రష్యాలకు వెళ్లే పర్యటనలను కూడా విదేశాంగ శాఖ తిరస్కరించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇలా అనేకమంది కేంద్రమంత్రుల విషయంలో జరుగుతుందని, ఇది ఏదో రేవంత్ రెడ్డికి మాత్రమే జరిగిన అన్యాయం లాగా ప్రచారం చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!