Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
- సీఎంను కలిసిన వరల్డ్ ఛాంపియన్షిప్ పతక విజేతలు
- శాలువాతో సత్కరించిన రేవంత్ రెడ్డి
- క్రీడాకారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
- ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Sports : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పర్యటనకు అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. విదేశీ పర్యటనలకు అనుమతులు నిరాకరించడం అనేది కేవలం ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నిబంధనలు కొత్తవి కావు.. కాంగ్రెస్ హయాం నుంచే ఉన్నాయి
కేంద్రమంత్రులు లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారిక విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు విదేశాంగ శాఖ అనుమతి తీసుకోక తప్పదని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విదేశాంగ నియమావళి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, గతంలో కాంగ్రెస్ హయాం నుంచే అమల్లో ఉందని గుర్తుచేశారు. గతంలో 2005లో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో రేవంత్ రెడ్డి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లేందుకు, ఆ తర్వాత లండన్ పర్యటనలకు కేంద్రమే అనుమతులు ఇచ్చిందని, కాబట్టి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
అర్హత లేని వ్యక్తులను కలిసేందుకు ప్రయత్నం?
ముఖ్యమంత్రి పర్యటనల విషయంలో అధికారులు అనేక అంశాలను సేకరించి, ఆయా సమావేశాల్లో పాల్గొనే వ్యక్తుల స్థాయి, వారి బ్యాక్‌గ్రౌండ్ , దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటారని విశ్లేషించారు. రేవంత్ రెడ్డి తన హోదాకు తగిన వ్యక్తులను కాకుండా అర్హత లేని వారిని కలవాలని నిర్ణయించుకున్నారని ఆరోపించారు. భారత ప్రధానిని ఉగ్రవాదితో పోల్చి, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలవడానికి సీఎం ప్రయత్నించారని, దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రులకు కూడా పర్యటనలు నిరాకరిస్తారు
విదేశాంగ విధానాలు, క్లియరెన్సులు లభించకపోవడం వంటి సాధారణ సాంకేతిక కారణాల వల్ల గతంలో తాను కెనడా, రష్యాలకు వెళ్లే పర్యటనలను కూడా విదేశాంగ శాఖ తిరస్కరించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇలా అనేకమంది కేంద్రమంత్రుల విషయంలో జరుగుతుందని, ఇది ఏదో రేవంత్ రెడ్డికి మాత్రమే జరిగిన అన్యాయం లాగా ప్రచారం చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!