Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- పాక్ అణు కేంద్రం ‘‘కిరాణాహిల్స్ ’’ దాడి..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో సంచలనంగా మారిన ఘటన..
- భారత డ్రోన్ ఢీకొట్టినట్లు వెల్లడించిన మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్..
- ఉద్దేశపూర్వకంగా దాడి జరగలేదని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధ కేంద్రంగా ఉన్న ‘‘కిరాణా హిల్స్’’పై దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, దీని గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పాకిస్తాన్ సర్గోధా సమీపంలోని కిరాణా హిల్స్‌ను భారత్ పంపిన లోయిటరింగ్ మ్యూనిషన్(డ్రోన్) ఢీకొట్టిన విషయం నిజమే అని చెప్పారు. అయితే, కిరాణా హిల్స్‌ను ఉద్దేశపూర్వకంగా అటాక్ చేయలేదని చెప్పారు.
కిరాణా హిల్స్ ఢీకొట్టడానికి కారణం ఇదే..
రాడార్లను లక్ష్యంగా చేసుకుని పంపింని భారతీయ డ్రోన్, బహుశా ఇజ్రాయిల్ రూపొందించిన హారోప్ డ్రోన్ సర్గోధా చుట్టుపక్కల రాడార్ల కోసం గాలిస్తున్న క్రమంలో ఇంధనం అయిపోయినట్లు జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఇప్పటికే ఎయిర్ మార్షల్ ఏకే భారతి కిరాణా హిల్స్ టార్గెట్ జరగలేదని చెప్పారని, ఇప్పుడు తాను కూడా ఇదే వివరణ ఇవ్వగలనని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దాడులకు ముందు సర్గోధా, కిరానా హిల్స్ ప్రాంతాల్లోకి అనేక లోయిటరింగ్ మ్యూనిషన్లను పంపినట్లు ఆయన చెప్పారు. సర్గోధాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన కిరానా హిల్స్ ఉన్నట్లు వివరించారు. నిర్దిష్టమైన ఆపరేషన్ కోసం సమయం ఉంటుందని, సుమారు రెండు గంటల పాటు గాలిస్తుంది, టార్గెట్ కనిపించకుంటే చివరకు ఎక్కడో చోట ఢీకొడుతుంది. ఇలా కిరాణా హిల్స్‌లోని కొండల్లో ఒక దాన్ని ఢీకొట్టి ఉండొచ్చని చెప్పారు.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
స్కార్దుపై దాడికి అనుమతి, కానీ..
ఆక్రమిత కాశ్మీర్‌లోని స్కార్డుపై దాడి చేసేందుకు భారత వైమానిక దళానికి అనుమతి ఇచ్చినట్లు జనరల్ చౌహాన్ వెల్లడించారు. అయితే ప్రతికూల వాతావరణం కారనంగా ఆ దాడిని నిలిపేసినట్లు చెప్పారు. దీంతో భోలారిపై దాడి చేశామని చెప్పారు. మే 10న జరిగిన వైమానిక దాడుల్లో భోలారీలోని హ్యాంగర్లపై భారత వైమానిక దళం జరిపిన దాడి అత్యంత కీలకమైందిగా నిలిచింది. ఈ దాడిని గాంధీనగర్‌లోని సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ నిర్వహించింది. భోలారిలో ఉన్న హ్యాంగర్లతో పాటు రన్‌వేపై పెద్ద గోతులు ఏర్పడటం అప్పట్లో వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!