BRS Leaders: ప్రభుత్వ, ప్రైవేట్ భూములను యథేచ్ఛగా కబ్జా చేసిన బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలపై కాంగ్రెస్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూబాధితులంతా బహిరంగ విచారణకు క్యూ కడుతున్నారు. వస్తున్న ఫిర్యాదులపై అధికారులు రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ మొదలుకొని అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భూములతో సంబంధం లేకుండా ఖాళీగా ఉన్న భూములను తప్పుడు పత్రాలతో కబ్జా చేసి సెటిల్ మెంట్ పేరుతో బెదిరించి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజావాణికి, పోలీస్ స్టేషన్లకు గతంలో అనేక ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. గత నెలలో ప్రభుత్వం మారిన వెంటనే సామాన్యులు ప్రజావాణిలో చేసుకున్న దరఖాస్తులపై అధికారులు దృష్టి సారించారు. తాజాగా అధిబాట్లలో బీఆర్ఎస్ నేతలపై భూకబ్జా కేసులు నమోదయ్యాయి.
Read also: Murder: ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన తండ్రికొడుకులు..!
బీఆర్ఎస్ నేత కన్నారావుతో పాటు 35 మందిపై కేసులు నమోదు చేసారు అధికారులు. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అధిబాట్లలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, తన గ్యాంగ్ యత్నించినట్లు ఆరోపణలపై వచ్చాయని, ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పాతారని వెలుగులోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగి 307.447.427.436.148.149 ఐపిసి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్ పేరుతో ఓ బిల్డర్ డెవలప్ చేస్తున్నట్లు గుర్తించారు. కన్నరావు గ్యాంగ్ భూమి చుట్టూ పెట్టిన బ్లూ షీట్స్ నిప్పు పెట్టిన కాల్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న 35 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కన్నారావును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తప్పు చేసిన వారెవరైనా సరే వారిని శిక్షపడాల్సిందే అని పోలీసులు తెలిపారు. అయితే.. కన్నారావు ఎక్కడికి వెళ్లిపోయాడు? అసలు ఎన్ని రోజుల నుంచి ఈ భూకబ్జా భాగోతం నడుస్తోంది? అనేది దర్యాప్తు చేస్తున్నారు. భూకబ్జా కేసులు 38 మందికి చేరడంతో పోలీసులు షాక్ లో వున్నారు. వీరికి ఎవరు సహకరించారన్నది బయటకు రావాల్సి ఉంది.
Mahadev App Scam : మహాదేవ్ యాప్ స్కామ్ డబ్బుతో కొన్న షేర్లలో ఆశ్చర్యకరమైన పెరుగుదల