Call Money: రోజు రోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కాల్ మనీ మాయలో పడి ఎంతో మంది బాధితులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా.. ఇలాంటి వారిని నమ్మవద్దని ఎన్ని సలహాలు ఇచ్చినా.. ఇలాంటి వారి నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా..పోలీసులకు ఆశ్రయించాలని చెబుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. వీరి వలలో బాధితులు చిక్కుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇక అమ్మాయిల పరిస్థితి అయితే దారుణంగా తయారవుతుంది. అప్పు తీర్చాలని లేదా కోరిక తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గత్యంతరం లేక వారి కోరిక తీర్చితే వాటిని వీడియో తీసి తమకే కాకుండా స్నేహితులతో పడుకోవాలని లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇటువంటి కేటు కాళ్ల ఆగడాల ఉచ్చులో పడి యువత జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. చివరకు విసిగిపోయిన ఆ యువతి బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆర్థిక పరిస్థితి బాగాలేక కాల్‌మనీ వ్యాపారుల వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత ఆ యువతి దివాళా తీసింది. దీంతో కేతుగ బాలికను రోజూ వేధించడం ప్రారంభించాడు. అప్పు చెల్లించకుంటే తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు. యువకుడు బాధితురాలికి ఫోన్ చేసి దుర్భాషలాడడంతో యువతి నిస్సహాయ స్థితిలో యువకుడితో కలిసి ఉండేందుకు అంగీకరించింది. అయితే.. వారిద్దరూ ఒంటరిగా జీవిస్తున్న సమయంలో.. యువతికి తెలియకుండా రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు కేటుగాడు. కామంతో అడితో ఆగలేదు. మరుసటి రోజు ఆ వీడియోలను తన స్నేహితులకు చూపించాడు.
ఆ వీడియోలు చూసిన నిందితుడి స్నేహితులు కూడా బాధితురాలిని తమతో కలిసి తిరగమని వేధించడం మొదలుపెట్టారు. తమతో సమయం గడపకపోతే వీడియోలను వైరల్ చేస్తామని బెదిరించారు. ఇక్కడితో ఆగదని గ్రహించిన యువతి తెగించింది. మీరు చేయాల్సింది చేయండి నేను మాత్రం మీరు చెప్పింది చేయనంటూ మెండికేసింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన కేటుగాడు యువతి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిందితుడి స్నేహితులు వీడియోలు వైరల్ చేయడంతో బాధితురాలిపై వేధింపులు ఎక్కువయ్యాయి. మానసిక వేదన భరించలేక బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. నారాయణగూడ పోలీసులు షీట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Miss World: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు