Telangana Assembly Session: అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న సభ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ… సభ నడుస్తుండగా మీడియా పాయింట్లో ఎవరూ మాట్లాడకూడదని స్పష్టం చేశారు. బ్రేక్ టైంలో మాత్రమే మీడియా పాయింట్‌లో సభ్యులు మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు. ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
ఇక ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో పెట్టింది. ప్రాణహిత ప్రాజెక్టు లో ఎలాంటి పురోగతి లేదు దీనికోసం కేటాయించిన 878 కోట్లు నిష్ఫలంగా మారిపోయాయన్నారు. రీఇంజనీరింగ్ పేరుతో డబ్బులు వృధా చేశారన్నారు. ప్రాణహిత మీద..2022 మార్చి నాటికి..1727 కోట్లు కాగా.. కాళేశ్వరం పై 86, 788 కోట్లు ఖర్చు.. కాళేశ్వరం పై అంతరాష్ట్ర సమస్యలు.. నిల్వ సామర్థ్యం.. సౌకర్యం పై సరైన అధ్యయనం చేయలేదన్నారు. అస్తవ్యస్తంగా.. పనులు ప్రారంభించారని తెలిపారు. మహారాష్ట్ర లో ముంపు సమస్యను కాగ్ ఎత్తిచూపించింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ.. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డితో సహా 1,47,427 కోట్లకు పెరిగిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ లేదన్నారు. ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయన్నారు. రి ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలిపారు. 2018 లో కాళేశ్వరం dpr ని కేంద్ర జలసంగం ఆమోదించాక ముందే 17 పనులు.. 25049 కోట్లకు అప్పగించారన్నారు.
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
Read also: Yash : అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన యష్.. ఫోటోలు వైరల్..
డీపీఆర్ తరువాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని తెలిపారు. తొలుత 2 టీఎంసీ ఎత్తిపాతలు ప్రతిపాదించి..అవసరం లెకున్న 3 టీఎంసీ లకు ప్రతిపాదన పెంచారని తెలిపారు. దీంతో 28.151 కోట్ల అదనపు వ్యయం. అంచనాలు పాత ధరలతో తయారు చేసి..పెరిగిన ధరలు మోతాన్ని చేర్చకుండ.. డీపీఆర్ లో ప్రాజెక్టు విలువ తక్కువ చేసి చూపెట్టారని అన్నారు. ఆ తరవాత మార్పులతో ప్రాజెక్టు విలువ 63352 కోట్ల నుండి 1 లక్ష 2267 కోట్లకు పెరిగిందన్నారు. భూసేకరణ పునరావాసం మిగిలి ఉందన్నారు. కేంద్ర జలసాంగ్ కి ఇచ్చిన రిపోర్టులో 81911 కోట్లు ఉందని తెలిపారు. 1,47,427 కోట్లకీ మించిపోయే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరంపై ఒక్కో ఎకరాకు అయ్యే మూలధనం వ్యయం 6 లక్షల 42 వేళకు తేలింది. ప్రాజెక్టుతో వచ్చే లాభాలు ఎక్జువ చూపి.. వార్షిక వ్యయం తక్కువ చూపారన్నారు. ఒక్క tmc తో 17668 ఎకరాల ఆయకట్టు వస్తుంది అని అంచనా వేశారు. ఇతర ప్రాజెక్టు లతో పోల్చితే 10 వేళా ఏకరాలకే సరిపోదన్నారు.
కాళేశ్వరం నిర్వహణకు 10 వేల కోట్లు పడుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం అంచనా కి మొత్తనికి అనుమతి ఇవ్వలేదన్నారు. ఒక్కో పనికి అనుమతి ఇస్తూ పోయిందని, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ పేరుతో అప్పులు తెచ్చిందన్నారు. 87,449 కోట్ల రుణాలు తెచ్చింది ప్రభుత్వం అని తెలిపారు. బడ్జెట్ నుండి వచ్చింది కేవలం 27 శాతం మాత్రమే కేటాయింపు.. ఖర్చు ఉందన్నారు. కాళేశ్వరం పై ఆదాయం లేదు కాబట్టి రుణాలు చెల్లింపు కష్టం అని కాగ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో బడ్జెట్ పై భారం పడుతుందన్నారు. 2020..21 లోనే రుణాల చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కానీ 9 ఆగ్రిమెంట్ లను వాయిదా వేయాలని కోరిందన్నారు. దీంతో వడ్డీల భారం 8182 కోట్ల అదనపు వడ్డీ భారం పడిందన్నారు. కాళేశ్వరం కోసం తెచ్చిన రుణాలను.. 1690 కోట్లు మళ్లించారని తెలిపారు. అందనంగా 587 కోట్లు వడ్డీ పడిందన్నారు. ప్రతి ఏటా.. 14 462 కోట్లు రుణాల చెల్లింపు.. వడ్డీకి కేటాయించాల్సి ఉందని, కాళేశ్వరం పనుల్లో 56 పనుల్లో 13 పూర్తి అయ్యాయన్నారు.
Haldwani Violence: హల్ద్వానీలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలింపు..
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!