జూబ్లీహిల్స్ లో.. జరిగిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఇంకా కొలిక్కిరాలేదు. ఆకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రమంతా దీనిపైనే ఫోకస్ పెట్టింది. దీంతో.. పబ్బులపై పోలీసులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లో వెలితే..హైదరాబాద్ లోని మొగల్ పురా పోలీస్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. రోజు సమయానికి ఇంటివచ్చే కుమార్తె…