Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలోని ఓల్డ్ టౌన్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. దీంతో ఈ భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనం కింది భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం పక్కకు వంగి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న భవనంలో నివసించే వారిని ఖాళీ చేయించారు. నిర్మాణంలో ఉన్న భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. భవనాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నేడు, ఈ భవనం కూల్చివేసే అవకాశం ఉంది.
Read also: IT Employees: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్న భవనం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూలిన భవనాన్ని కూల్చే వరకు పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. గతంలో ఇదే తరహాలో ఓ భవనం బోల్తా పడిన ఘటన నగరంలోని చింతల్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లోని చింతల్‌లో మూడంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ జాక్‌లతో పైకి లేపారు. అయితే ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్ పైకి వాలుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైడ్రాలిక్ జాక్‌లతో భవనాన్ని పైకి లేపుతున్నప్పుడు భవనంలో చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. అంతేకాదు భవనం యజమానిపై కేసు నమోదు చేశారు. భవనాల నిర్మాణ సమయంలో నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనుమతులు లేకుండా నిర్మించడం, నాణ్యత లేని నిర్మాణాల వల్లే ఈ తరహా పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tirupati Crime: తిరుపతిలో షాకింగ్ ఘటన.. పోలీసులు కొట్టారంటూ రోడ్డుపై మహిళ నిరసన
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!