Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu–Pawan Kalyan Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి సమన్వయం, సీట్ల సర్దుబాటు, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సహకారంపై చర్చించినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో కూటమి 100 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా జాయింట్ మెకానిజం ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీడీపీ–జనసేన నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఎన్నికల సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ఏ ప్రాంతంలో ఏ పార్టీకి బలముందో ఆ స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీట్ల సర్దుబాటు చేయాలని ఇరువురు నేతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. బలమున్న చోట కూటమి భాగస్వామ్య పక్షాలు పోటీ చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా పార్టీల బలాబలాలు, నాయకుల ప్రభావం, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రాధాన్యం ఇచ్చి సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్లు సమాచారం.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
స్థానిక ఎన్నికల్లో టీడీపీ–జనసేన మధ్య ఎలాంటి విభేదాలకు తావులేకుండా కలిసి పనిచేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కూటమి ఐక్యత, పరస్పర సమన్వయంపై క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం వెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఎన్నికల సమయంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, స్థానికంగా తలెత్తే సమస్యలను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా జాయింట్ మెకానిజం పనిచేసే అవకాశం ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే టీడీపీ–జనసేన మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికల వ్యూహంపై మరింతగా చర్చించేందుకు త్వరలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!