Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Tickets: టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది. దర్శనం టిక్కెట్లు, వసతి గదుల బుకింగ్ కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్జిత సేవ, కల్యాణోత్సవం, వర్చువల్ సేవ, అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, డార్మిటరీ రూమ్ బుకింగ్ టిక్కెట్లను ప్రకటించింది. నవంబరు మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను నిన్న ఉదయం విడుదల చేశారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అష్టదళపద్మారాధన కోసం భక్తులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అర్చన ఆర్జిత సేవా టిక్కెట్లను లక్కీడిప్ ద్వారా పొందవచ్చునని తెలిపింది. పేర్ల నమోదు అనంతరం లక్కీడిప్ ద్వారా భక్తులకు టిక్కెట్లు కేటాయిస్తారు. టిక్కెట్లు పొందిన తర్వాత భక్తులు రుసుము చెల్లించి ధృవీకరించుకోవాలని అధికారులు వెల్లడించారు.
Read also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
సహస్రదీపాలంకార, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలాగే, ఆగస్ట్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సర్వీస్ టిక్కెట్లు విడుదల చేయబడతాయి. ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టిక్కెట్లను, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని హాస్టళ్ల బుకింగ్ కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దర్శనం, వసతి టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ ముందుగానే ప్రకటించింది. దీంతో భక్తులు ముందస్తు సమాచారం తెలుసుకుని టిక్కెట్లు విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అన్ని టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!