Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Morne Morkel on Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు లక్నోలోని ఏకానా స్టేడియంలో తొలి టీ20 ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు టీమిండియా కూర్పు ఎలా ఉండబోతోంది?, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. తొలి టీ20కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడారు. తుది జట్టుపై నిర్ణయంను కెప్టెన్, హెడ్ కోచ్ కలిసి తీసుకుంటారని తెలిపారు.
‘గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను రొటేట్ చేస్తారని నేను భావిస్తున్నాను. తుది జట్టును ఎంచుకునే బాధ్యత సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్‌పై ఉంటుంది. తదుపరి ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించేందుకు ఏ కూర్పు అత్యుత్తమంగా ఉంటుందో దానినే పరిగణనలోకి తీసుకుంటాం. అదే మా ప్రధాన లక్ష్యం’ అని బౌలింగ్ కోచ్ మోర్కెల్ పేర్కొన్నారు. తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? అనే ప్రశ్నకు.. అతడిలో ఉన్న టాలెంట్ గురించి టీమ్ మేనేజ్మెంట్కు పూర్తిగా తెలుసని చెప్పారు. ‘వైభవ్‌లో ఉన్న ప్రతిభ గురించి మనందరికీ తెలుసు. అతడు సీనియర్ ఆటగాళ్లతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మంచిది. ఈ స్థాయిలో అతడు ఎక్కువగా శిక్షణ పొందడం అతడి క్రికెట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది’ అని మోర్కెల్ అన్నారు.
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ఒకవేళ తొలి మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోయినా.. అతడికి టీమ్‌తో కలిసి ఉండటం ద్వారా చాలా నేర్చుకునే అవకాశం ఉంటుందని మోర్కెల్ వివరించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడటం, వారి ఆటను దగ్గరగా గమనించడం కూడా యువ ఆటగాడి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సీనియర్ ఆటగాళ్లు తమ ఇన్నింగ్స్‌ను ఎలా ప్రారంభిస్తారు? తొలి 15 బంతులను ఎలా ఎదుర్కొంటారు? పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వ్యూహాలు రూపొందించుకుంటారు? వంటి అంశాలను యువ ఆటగాళ్లు గమనించాలని మోర్కెల్ సూచించారు.
అవకాశాలు ఎక్కువగా దక్కినా, పరిమితంగా లభించినా యువ ఆటగాళ్లు నేర్చుకునేలా చేయడం టీమ్ మేనేజ్మెంట్ బాధ్యత అని మోర్నీ మోర్కెల్ స్పష్టం చేశారు. ప్రశ్నలు అడుగుతూ, సీనియర్ల నుంచి నేర్చుకుంటూ ఎదగడం వైభవ్‌కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దీంతో వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్ తుది జట్టులో ఉంటాడా? లేదా బెంచ్‌కే పరిమితం అవుతాడా? అనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే మ్యాచ్ ఆడకపోయినా సీనియర్ ఆటగాళ్లతో కలిసి గడిపే ప్రతి క్షణం వైభవ్ భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని మోర్కెల్ అంటున్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!