పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐటెల్ కేర్ ఫీచర్ ఫోన్ లాంచ్..
- ఐటెల్ కేర్ ధర రూ.1,499..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
itel Care: వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐటెల్ (itel) భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ కేర్ (itel Care) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లో వృద్ధులు సులభంగా ఉపయోగించుకునేలా పెద్ద బటన్లు, మాగ్నిఫైడ్ డిస్ప్లే, వాయిస్ గైడెన్స్, అత్యవసర ఎస్ఓఎస్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు.
ఎస్ఓఎస్ అలర్ట్
ఐటెల్ కేర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఎరుపు రంగు ఎస్ఓఎస్ బటన్ ఇచ్చారు. దీనిని రెండు సెకన్ల పాటు నొక్కితే ముందుగా సేవ్ చేసుకున్న ఐదు కాంటాక్ట్‌లకు అత్యవసర ఎస్ఎంఎస్ అలర్ట్ వెళ్తుంది. ఆ తర్వాత ప్రైమరీ కాంటాక్ట్‌కు ప్రాధాన్యత ఇస్తూ వరుసగా వాయిస్ కాల్స్ వెళ్లేలా ఈ ఫోన్‌ను తయారు చేశారు.
Also Read
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
మాటలతో ఫోన్ ఆపరేట్
చూపు సమస్యలు ఉన్నవారు, చదవడం రాని వృద్ధులకు ఉపయోగపడేలా కింగ్ వాయిస్ ఫీచర్‌ను అందించారు. ఇది మెనూ ఆప్షన్లు, వచ్చిన మెసేజ్‌లు, ఇన్కమింగ్ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లిష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా చదివి వినిపిస్తుంది.
ఫోన్లో 2 అంగుళాల మాగ్నిఫైడ్ డిస్ప్లే, పెద్ద సైజు బటన్లు, పెద్ద ఐకాన్లతో కూడిన ఇంటర్ఫేస్ ఉన్నాయి. దీంతో వృద్ధులు స్క్రీన్‌పై సమాచారాన్ని సులభంగా చూడటంతో పాటు టైప్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఇందులో 500 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లకు ఫొటోలను కూడా జోడించుకునే సదుపాయం ఉంది.
ఐటెల్ కేర్‌లో 10 ప్రాంతీయ భారతీయ భాషల్లో యూజర్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 22 భాషల్లో రీడింగ్ సపోర్ట్ అందించారు. వృద్ధులు తమకు అనుకూలమైన భాషలో ఫోన్‌ను ఉపయోగించుకునేలా ఈ సదుపాయం కల్పించారు. వినికిడి సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2030 బాక్స్ స్పీకర్, ప్రత్యేక ఆడియో పవర్ యాంప్లిఫైయర్‌ను అందించారు. కాల్స్ సమయంలో చుట్టుపక్కల శబ్దాలను తగ్గించేందుకు ఏఐ ఈఎన్సీ టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించారు.
1,150 mah బ్యాటరీ
పవర్ కోసం ఐటెల్ కేర్‌లో 1,150 mah బ్యాటరీ ఇచ్చారు. దీనిని యూఎస్బీ టైప్-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్లో సైడ్ స్విచ్‌తో పనిచేసే డ్యూయల్ ఎల్ఈడీ టార్చ్, వీజీఏ కెమెరా, వైర్లెస్ ఎఫ్ఎం రేడియోతో పాటు రికార్డింగ్ సదుపాయం, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32జీబీ వరకు పెంచుకోవచ్చు.
ధర
ఐటెల్ కేర్ ఫీచర్ ఫోన్ ధరను రూ.1,499గా నిర్ణయించారు. బ్లాక్, డార్క్ గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బాక్స్‌లో ప్రొటెక్టివ్ బ్యాక్ కవర్ కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఒక సంవత్సరం కౌంటర్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఐటెల్‌కు ఉన్న 1.30 లక్షలకు పైగా రిటైల్ ఔట్లెట్లు, 1,000 సర్వీస్ సెంటర్ల ద్వారా విక్రయాలు, సర్వీస్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!