Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur Quits As Indian Women’s Team Captain: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్ అధికారికంగా ప్రకటించారు. దీంతో భారత మహిళల క్రికెట్లో హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ శకానికి తెరపడింది. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత జట్టు ఎన్నో కీలక విజయాలు సాధించడంతో పాటు చారిత్రాత్మక మైలురాళ్లను అందుకుంది.
భారత మహిళల జట్టు ఇటీవలి ప్రదర్శనలపై సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ ఇటీవల గువాహటిలో సమావేశం నిర్వహించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హర్మన్‌ప్రీత్ కౌర్ సహా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుమ్దార్ హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయం స్వయంగా తీసుకున్నారా? లేదా సమావేశంలో ఆమెను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోరారా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే తన నిర్ణయం వెనుక కారణాలను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు చేశారు.
Also Read
- Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
- Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
- Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
- IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
‘భారత మహిళల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా నేను వైదొలుగుతున్నాను. ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో క్షణాలు ఈ నిర్ణయంతో ముడిపడి ఉన్నాయి’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నారు. భారత మహిళల క్రికెట్ కోసం తన శక్తిమేరకు అన్నీ చేశానని వెల్లడించారు. తన రక్తం, చెమట, సమయం మాత్రమే కాకుండా.. ఎన్నో సందర్భాల్లో వ్యక్తిగత ఆట, వ్యక్తిగత ఆశయాలను కూడా పక్కన పెట్టానని తెలిపారు. జట్టు ప్రయోజనాలే తనకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉండేవని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు.
2016లో హర్మన్‌ప్రీత్ కౌర్ తొలిసారి భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం వహించారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల జట్టు కీలక విజయాలు సాధించింది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ విజయం, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం వంటి చారిత్రాత్మక విజయాల్లో ఆమె నాయకత్వం కీలకంగా నిలిచింది. కొంతకాలంగా హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి చర్చ జరుగుతోంది. కెప్టెన్‌గా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పాటు బ్యాటర్‌గా ఆమె ప్రదర్శనపై కూడా విమర్శలు వచ్చాయి. ఆమె స్థానంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే తన కెప్టెన్సీపై వచ్చిన విమర్శలకు హర్మన్‌ప్రీత్ కౌర్ తన పోస్టులో స్పందించారు. కెప్టెన్‌గా తాను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక జట్టు ప్రయోజనమే ఉందని పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు అందరికీ అర్థం కాకపోవచ్చని, కొన్ని సందర్భాల్లో అవి తనకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందికరంగా మారాయని తెలిపారు. ‘కెప్టెన్‌గా నేను ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అవి ఎప్పుడూ అందరికీ అర్థం కాలేదు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం సులభం కాదు. కొన్నిసార్లు వాటి కోసం నేను వ్యక్తిగతంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ నేను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఒకే ఉద్దేశం ఉంది. జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం, ఇతర ఆటగాళ్లకు ఎదిగే అవకాశం కల్పించడం, తమపై నమ్మకం పెంచడం, తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా చేయడమే నా లక్ష్యం’ అని హర్మన్‌ప్రీత్ తెలిపారు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఇకపై హర్మన్‌ప్రీత్ తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరోవైపు భారత మహిళల జట్టుకు కొత్త నాయకత్వ దిశను రూపొందించే బాధ్యత బీసీసీఐపై ఉంటుంది. దీర్ఘకాలంగా వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధానకు తదుపరి నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకడం భారత మహిళల క్రికెట్లో కీలకమైన మార్పుగా మారింది. ఆమె నాయకత్వంలో సాగిన ఒక శకం ముగియగా.. ఇప్పుడు కొత్త నాయకత్వంలో టీమిండియా ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..