Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
- భారత మారథాన్‌కు కొత్త చరిత్ర
- సావన్ బర్వాల్ రజత పతకంతో అరుదైన ఘనత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games Marathon: భారత అథ్లెటిక్స్‌లో సావన్ బర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. 28 ఏళ్ల ఆర్మీ అథ్లెట్ ఆసియా క్రీడల మారథాన్‌లో రజత పతకం గెలుచుకోవడంతో పాటు తన జాతీయ రికార్డును మరోసారి మెరుగుపర్చాడు. 42.195 కిలోమీటర్ల రేసును సావన్ బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేశాడు. జపాన్‌కు చెందిన ఇచిటాకా యమషితా 2:10:49 సమయంతో స్వర్ణ పతకం సాధించగా, చైనాకు చెందిన పెయియూ ఫెంగ్ 2:12:13తో కాంస్య పతకం గెలిచాడు.
44 ఏళ్ల తర్వాత మారథాన్‌లో భారత్‌కు పతకం
సావన్ బర్వాల్ రజతంతో ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌కు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో హోసూర్ కుక్కప్ప సీతారన్ కాంస్య పతకం గెలిచిన తర్వాత.. మారథాన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఆసియా క్రీడల మారథాన్‌లో పతకం సాధించిన నాలుగో భారతీయ అథ్లెట్‌గా బర్వాల్ నిలిచాడు. 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడల్లో చోట్టా సింగ్ స్వర్ణం, సూరత్ సింగ్ మాథుర్ కాంస్య పతకాలు సాధించారు.
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
మారథాన్లోకి వచ్చి ఏడాదే
సావన్ బర్వాల్ ఇటీవలే మారథాన్‌పై దృష్టి పెట్టాడు. అంతకుముందు అతను 5,000 మీటర్లు, 10,000 మీటర్లు, హాఫ్ మారథాన్ వంటి లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్లలో పోటీ చేసేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రోటర్‌డామ్‌లో జరిగిన NN మారథాన్‌లో 2:11:58 సమయంతో పరుగెత్తి శివనాథ్ సింగ్ 48 ఏళ్ల క్రితం నెలకొల్పిన జాతీయ రికార్డును బర్వాల్ అధిగమించాడు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో 2:11:37 సమయంతో మరోసారి తన జాతీయ రికార్డును మెరుగుపర్చాడు. రేసు అనంతరం బర్వాల్ మాట్లాడుతూ.. తన లక్ష్యం జాతీయ రికార్డును బద్దలు కొట్టడం కాదని, పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నానని చెప్పాడు. దేశం కోసం, అదీ చాలా కాలం తర్వాత మారథాన్‌లో పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
చివరి వరకు ముందంజలోనే..
సుమారు 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, స్వల్ప గాలి, చిరుజల్లుల మధ్య మారథాన్ జరిగింది. ప్రారంభం నుంచే బర్వాల్ ముందంజలో కొనసాగాడు. హాఫ్ మారథాన్ దశకు చేరుకునే సమయానికి 21.1 కిలోమీటర్లను 1:05:54లో పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. 35 కిలోమీటర్ల తర్వాత అగ్రస్థానంలో ఉన్న గ్రూప్‌లో ముగ్గురు రన్నర్లు మాత్రమే మిగిలారు. 39-40 కిలోమీటర్ల వరకు ముందున్న గ్రూప్‌తో కలిసి కొనసాగి.. చివరి 1-2 కిలోమీటర్లలో తుది ప్రయత్నం చేయాలన్నది తన వ్యూహమని బర్వాల్ తెలిపాడు. జపాన్ రన్నర్ వేగం పెంచినప్పటికీ.. తనకు అనుకూలమైన వేగాన్ని కొనసాగిస్తూ రేసును పూర్తి చేశాడు. చివరకు రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
14 ఏళ్ల వయసులో మొదలైన ప్రయాణం
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా జోగిందర్నగర్కు చెందిన సావన్ బర్వాల్ చిన్నతనంలోనే అథ్లెటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అతని అన్న స్కూల్ ట్రాక్ టీమ్‌లో ఉండేవాడు. 14 ఏళ్ల వయసులో అన్నతో కలిసి ట్రాక్‌కు వెళ్లిన బర్వాల్ను 1500 మీటర్ల పరుగులో శిక్షణకు తీసుకున్నారు. 2015లో అండర్-18 విభాగంలో 3000 మీటర్ల ఈవెంట్‌తో జాతీయ స్థాయి పోటీల్లోకి అడుగుపెట్టాడు. 2021లో ఫెడరేషన్ కప్‌లో 5000 మీటర్లతో సీనియర్ స్థాయి పోటీల్లోకి వచ్చాడు. 2025 నేషనల్ గేమ్స్‌లో 5,000 మీటర్లు, 10,000 మీటర్లలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2019లో స్పోర్ట్స్ కోటా ద్వారా తన అన్నతో కలిసి భారత సైన్యంలో చేరాడు.
మరో భారతీయుడికి 17వ స్థానం
ఈ మారథాన్‌లో పాల్గొన్న మరో భారతీయ అథ్లెట్ కార్తిక్ కర్కేరా 2 గంటల 22 నిమిషాల 41 సెకన్లలో రేసును పూర్తి చేసి 17వ స్థానంలో నిలిచాడు. సావన్ బర్వాల్ రజత పతకంతో ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం అందించడంతో పాటు.. వరుసగా రెండో మారథాన్‌లో జాతీయ రికార్డును మెరుగుపర్చడం విశేషంగా నిలిచింది.
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
-
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!