Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. సచివాలయం రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు దారిపొడవునా వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే మార్గం గణేష్ విగ్రహాల వాహనాలతో కిక్కిరిసిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్యాంక్ బండ్ వైపే సాగుతుండటంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
అయినా జోష్ ఏమాత్రం తగ్గకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. వేలాది గణనాథుల విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తుండగా.. యువత ఆటపాటలతో, నృత్యాలతో గణపయ్యలకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. రాత్రంతా ప్రశాంతంగా సాగిన నిమజ్జన కార్యక్రమాలు తెల్లవారుజామున కూడా కొనసాగాయి. ప్రస్తుతం కూడా ఇంకా వందలాది విగ్రహాలు నిమర్జనానికి సిద్ధంగా ఉన్నాయి.
Also Read
- CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
- Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
- CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
- CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
మరోవైపు పాతబస్తీలోని చార్మినార్ వద్ద గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చార్మినార్ మీదుగా 1,500కు పైగా గణేష్ విగ్రహాలను ట్యాంక్‌బండ్, వినాయక సాగర్ వైపు తరలించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య శోభాయాత్ర సాగింది. భద్రతా ఏర్పాట్లలో సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టి.. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో ట్యాంక్‌బండ్ వైపు సాగనంపారు.
చార్మినార్ నుంచి వినాయక సాగర్ వైపు చివరి గణనాథుడు ఉదయం 2:30 గంటల సమయంలో తరలివెళ్లాడు. దీంతో చార్మినార్ నుంచి సాగిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. విధి నిర్వహణలో రాత్రంతా బందోబస్తులో ఉన్న పోలీసులు.. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలోని ఒత్తిడిని స్టెప్పులతో తగ్గించుకున్నారు.
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!