Sabitha Indra Reddy: మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదు లక్షల విద్యాబరోసా ఇస్తా అన్నప్పుడు సంఖ్య పెరగాలి కానీ, ఎందుకు 2 లక్షలు తగ్గింది? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.