BRS: తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్‌ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా, వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు రెండు కీలక లేఖలు రాశారు.. ఒక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను…
భద్రాద్రి ఆలయం పేరును దుర్వినియోగం చేస్తున్నారని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆరోపిస్తూ అమెరికాలోని రామమందిరంపై దేవస్థానం అధికారులు వివాదంలో చిక్కుకున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ భద్రాద్రి దేవాలయం పేరును ఉపయోగించి విరాళాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఆలయ పేరు దుర్వినియోగం కాకుండా న్యాయపోరాటం చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఆలయం పేరుకు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు సమాచారం. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పేటెంట్ చట్టాలు పేరు లేదా…
ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో రామాలయం వద్ద ఉన్న అన్నదానం సత్రం చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. రామాలయం వద్ద నీళ్లు చేరి అంతా చెరువులా మారింది .
నేటి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానము నందు శ్రీరామనవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం అంతరాలయంలోని ధ్రువమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారోహణం చేయనున్నారు.
భద్రాచలంలో రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారామ కళ్యాణం కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. రెండేళ్ల తరువాత కరోనా అనంతరం జరుగుతున్న కల్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మిథిలా స్టేడియంను ఇప్పటికే పోలీస్ యంత్రాంగం తన చేతుల్లోకి తీసుకుంది.. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. దేవాదాయశాఖ మంత్రి…