తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఎక్స్ (X) వేదికగా బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు.