Navneet kaur: జహీరాబాద్‌లో బీజేపీ తరపున నవనీత్ కౌర్ ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navneet kaur: తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈ సారి తెలంగాణలో 17 సీట్లకు గానూ డబుల్ డిజిల్ సీట్లను సాధించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బీజేపీ నేతల్ని రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రముక బీజేపీ నేత, తమిళనాడు చీఫ్ అన్నామలై తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలుగు వారికి సుపరిచితమైన, టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న నవనీత్ కౌర్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారు.
Read Also: Maharashtra: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. నిన్న ఆమె బీజేపీ తరుపున ప్రచారం చేస్తూ, బీబీ పాటిల్‌ని గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఆమె మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో బీబీ పాటిల్ తన నియోజకవర్గంలో పనిచేయడం తాను చూశానని అన్నారు. ఈ సారి బీజేపీ 400 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలువందల స్థానాల్లో జహీరాబాద్ కూడా ఒకటని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌కి ఓటేయడం అంటే పాకిస్తాన్‌కి ఓటేయడమని, దాన్ని ఎదురించేందుకే తాను వచ్చానని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు మాత్రమే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అంటారని దుయ్యబట్టారు. గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన క్రెడిట్ బీజేపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. ఎస్సీ/ఎస్టీలను గౌరవించే వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఉన్న 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా మోడీని గద్దె దించడమే ధ్యేయంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!