Telangana BJP: తెలంగాణంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ రె’ఢీ’.. వచ్చే నెలలో షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారిస్తున్నాయి. బీఆర్ఎస్ పెండింగ్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేస్తూ… నిరుపేదలకు విడతల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేస్తూ… ప్రజల్లో ఉండేలా ప్రయత్నిస్తోంది. ఇక.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. ఇక… ఎన్నికల శంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో… రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహించాలని యోచిస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్‌లో కమలం పార్టీ 30 నుంచి 40 సమావేశాలు నిర్వహించబోతోంది. ఆ సమావేశాలకు పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి వివరించాలని ప్లాన్ చేసింది. అంతేకాదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించబోతున్నారు. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభకు 17 లోక్‌సభ స్థానాలను కూడా కేటాయించాలని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టనున్న కార్యక్రమాలను ఈ సభల ద్వారా కమలం పార్టీ నేతలు వివరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. అక్టోబరు 1న మహబూబ్‌నగర్ జిల్లాలో, 3న నిజామాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ కూడా బహిరంగ సభలు నిర్వహించింది. సభల ద్వారా ఎన్నికలను పూరించి ప్రచారంలో వేగం పెంచాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అనంతరం… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్టోబర్ 6న తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత… అక్టోబర్ 7న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను నిర్వహించబోతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.ఆదిలాబాద్ లో సభ నిర్వహించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇలా… పార్టీ జాతీయ నేతలను తెలంగాణకు ఆహ్వానించి… వచ్చే ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించేలా తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది.
Suryapet: దారుణం.. గురుకుల హాస్టల్లో ఉరికి వేలాడుతూ కనిపించిన విద్యార్థి..!
తాజావార్తలు
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
ట్రెండింగ్
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..