Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరించింది. అందులో భాగంగా ఇతర దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడంతో, వాణిజ్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చైనా, భారత్, మెక్సికో, యూరప్ దేశాల ఉత్పత్తులపై అదనపు పన్నులు విధించిన ట్రంప్.. తాజాగా ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లపై టారిఫ్ విధించాలని నిర్ణయించారు. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న ట్రేడింగ్ సెషన్‌లో లాభాలు కనబరిచిన ఫార్మా స్టాక్స్ నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన.
Read Also: O Yeong Su: ప్రముఖ నటుడుకి జైలు శిక్ష
అమెరికా ఫార్మా ఉత్పత్తులపై త్వరలో సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించడంతో.. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 4.2 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ఈ సూచీ 20,521 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయికి చేరింది. భారత్‌లో ఉత్పత్తి చేసే ఫార్మా ఉత్పత్తులపై అమెరికా కొత్తగా పన్ను విధించనుంది. దీనివల్ల భారత ఫార్మా కంపెనీలు నష్టపోయే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల ప్రభావంతో నిన్న సుస్థిరంగా కొనసాగిన ఫార్మా రంగం ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది. ముఖ్యంగా దిగ్గజ ఫార్మా కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. ఇందులో ముఖ్యంగా అరబిందో ఫార్మా, ఐపీసీఏ లేబొరేటరీస్, లుపిన్, బయోకాన్, సిప్లా, దివీస్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా ఇలా అన్ని కంపెనీలు భారీగా నష్టాల్లో ముగిసాయి.
అమెరికా తరచుగా ఇతర దేశాల ఉత్పత్తులపై టారిఫ్ విధించడంతో.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య సంబంధాలు ప్రభావితమవుతున్నాయి. భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా ఉండటంతో అమెరికాలో అధిక పన్నులు విధిస్తే ఎగుమతులపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తంగా ఆర్ధిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించే వరకు ఫార్మా స్టాక్స్‌లో స్థిరత్వం రావడం కష్టమే. అయితే ఈ తగ్గుదల దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందా లేదా అనేది త్వరలో తేలనుంది.