Muralidhar Rao: కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు. 1948 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు తక్కువ దేశభక్తి గల పార్టీలు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చాడు… అప్పటి నుండి ఇప్పటి వరకు సెప్టెంబర్ 17ను ఎందుకు జరపలేదని మురళీధర్ రావు ప్రశ్నించారు. కేంద్రం చేస్తామని చెప్పాక.. ఆ క్రెడిట్ బీజేపీకి పోవద్దని జాతీయ ఐక్యత దినం అని సీఎం ప్రకటించారన్నారు. అసదుద్దీన్ ఓవైసీతో పర్మిషన్ తీసుకొని ప్రకటించారని ఆరోపించారు.
YS Sharmila: మరోసారి నిరంజన్రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైర్.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి..!
నరరూప రాక్షసుడు ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ అని విమర్శించారు. కేసీఆర్ స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. పాకిస్తాన్ జెండాలు తెలంగాణలో అక్కడక్కడ ఉన్నాయని… బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జెండాలు ఉండవన్నారు. దేశభక్తికి వ్యతిరేకంగా కేసీఆర్ను నడవనివ్వమన్నారు. అసదుద్దీన్ ఒవైసీని భారత్ మాతా కి జై, జై భారత్ మాతా అనే వరకు వదలిపెట్టమన్నారు.