రాష్ట్ర రాజధాని నడిబొడ్డున దేశంలో అత్యంత ఎత్తయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం మరో 24 గంటల్లో కొలువు దీరనుంది.

అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 14.04.23న ఆవిష్కరించనున్నారు. 

ఈ కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు.  దీనిని బేస్ 50 ఫీట్లు ఉంది. ఈ బేస్ అనేది పార్లమెంట్ నమూనాలో నిర్మించారు. 

పార్లమెంట్ నమూనాలో నిర్మించడానికి ప్రధాన కారణం పార్లమెంట్​లో చట్టం ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో దానిని రూపొందించింది అంబేడ్కర్ కాబట్టి పార్లమెంట్ నమూనాలో బేస్​ను రూపొందించారు. 

విగ్రహాన్ని తయారు చేయడానికి బ్రాంజ్(కాంస్యం) లోపల వాడిన స్టీల్ 155టన్నులు, బ్రాంజ్ బరువు 111టన్నులు.

భూకంపాలు వచ్చినా తట్టుకునేలా, గాలి ఒత్తిడికి తట్టుకునేలా, వర్షాలు, ఎండలు వీటన్నింటికీ తట్టుకునే విధంగా దీనిని తీర్చి దిద్దారు. 

అంబేడ్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి పార్లమెంట్ నమూనాలో ఏర్పాటు చేసిన బేస్ లో ఆయన జీవిత చరిత్రను తెలియజేసేలా గ్యాలరీని, మ్యూజియం అలాగే ఒక థియేటర్ ను కూడా నిర్మించారు. 

ఆ థియేటర్​లో.. సందర్శకులకు అంబేడ్కర్ జీవిత చరిత్ర, విశేషాలతో కూడిన చిత్రాలను కూడా చూపిస్తారు.