ఉప ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.