గద్వాల జిల్లా గద్వాలలో న్యూడ్ కాల్స్ రికార్డింగ్ వ్యవహారం రచ్చ రేపుతోంది . ఈ ఎపిసోడ్ లో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశం మరో పక్క రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఇదిలా ఉంటే అసలు నిందితులను వదిలేసారు అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. న్యూడ్ కాల్స్ వ్యవహారం లో టౌన్ ఎస్ ఐ హరి ప్రసాద్ పై శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. న్యూడ్ కాల్స్ వ్యవహారంలో నిందితుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి, ఇసుక, రేషన్ బియ్యం మాఫియాలతో సంబంధాలున్నట్లు తేలడంతో చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూల్ ఎస్ బి కి అటాచ్ చేశారు.
గద్వాల పట్టణంలో చోటు చేసుకున్న న్యూడ్ ఫోన్ కాల్స్ రికార్డింగ్ ఆపై బ్లాక్ మెయిల్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని రిమాండ్ చేసిన పోలీసులు, కేసులో కీలకమైన వ్యక్తులు వున్నారని ప్రచారం జరగడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు . దీంతో పాటు నిందితులతో అంటకాగారనే ఆరోపణలతో గద్వాల టౌన్ ఎస్ ఐ పై శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు . ఆయన్ను నాగర్ కర్నూలు ఎస్ బి కి బదిలీ చేశారు . ఉన్నతాధికారుల విచారణ పై తమకు నమ్మకం లేదని షీట్ బృందం చేత విచారణ జరిపించాలని, అసలైన నిందితులను అరెస్టు చేయలని , ఈ కేసులో చాలా మంది పోలీసులు ప్రమేయం వుండాటంతో ఉన్నతాధికారులు వారి పై చర్యలు తీసుకొరని హైకోర్టు న్యాయవాది రాఘవేంద్ర రెడ్డి డిజిపి కి ఫిర్యాదు చేశారు. అయితే డిజిపి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో జిల్లా పోలీసు అధికారులకు ఈ న్యూడ్ ఫోన్ కాల్స్ వ్యవహారం పెద్ద సవాల్ గా మారిందనే చెప్పవచ్చు.
Read Also: Rajayogam: డబుల్ మసాలా బిర్యానీ లాంటి ‘రాజయోగం’!
గడిచిన పదిహేను రోజుల నుంచి ఈ వ్యవహరం సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికి గద్వాల టౌన్ ఎస్ ఐ హరిప్రసాద్ రెడ్డి నిందితులను బెదిరించి లక్ష రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆయన పై కూడా ఉన్నతాదికారులు చర్యలకు పూనుకున్నారు . మరో పక్క ఈ వ్యవహారం రాజకీయంగాను దుమారం రేపుతోంది . అసలు నిందితులు టిఆర్ఎస్ వారే అని బిజెపి ఆరోపిస్తుండగా … నిందితులెవరైనా కఠినంగా శిక్షించాల్సిందే అని టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకటించారు. ఇదిలా ఉంటే అసలైన వారిని అరెస్ట్ చేయకుండా తూతూమంత్రంగా అరెస్ట్ లు చేస్తున్నారు నిందితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు . అసలు నిందితులను తప్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Read Also: Geetu Royal: విన్నర్‌ను ప్రకటించే వరకూ గీతూరాయల్ కనపడదా?
అయితే న్యూడ్ ఫోన్ కాల్స్ వ్యవహారంలో అసలైన బాధితుల నుంచి ఫిర్యాదులు రాకపోవడంతో అసలు నేరస్తులెవరో తేల్చడం పోలీసులకు సవాల్ గా మారింది. కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు .ఈ వ్యవహారంలో చాలా వీడియో లు నిందితుల నుంచి సేకరించినట్లు సమాచారం. కొంతమంది పోలీస్ అధికారులతో పాటు రాజకీయ నేతలు, ప్రభుత్వ టీచర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్ర కూడా ఉన్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు . ఇక పోలీసులు ఒకరిద్దరి మహిళల వీడియోలు మాత్రమే ఉన్నాయని , అవి కూడా వారి వ్యక్తిగత సంబంధాలతో ముడిపడినవని చెబుతుండగా …. గద్వాల పట్టణంలోని వందకు పైగా మహిళల వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది . అందులో ముఖ్యంగా అర్ధిక పరిపుష్టి గల మహిళల వీడియోలను అడ్డుపెట్టుకుని వారి వద్ద నుంచి డబ్బులు దండుకోవడంతో పాటు , శారీరకంగా కూడా వేధించినట్లు సమాచారం . నిందితులకు పోలీస్ అండదండలు ఉండటం తో వారు చెలరేగి పోయారని విపక్షాలు మండి పడున్నాయి
మొత్తం మీద విష సంస్కృతి గద్వాల కు పాకిందని , గద్వాలలో ఇలాంటి గలీజ్ పని చేసిన వారిని కఠినంగా శిక్షించడం తో పాటు అసలు నేరస్థులను పట్టుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది . న్యూడ్ వీడియో కాల్స్ పై జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలేది లేదంటున్నారు ఎస్పీ రతన్ కుమార్. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, పోలీస్ అధికారుల ప్రమేయం వుంటే ఉన్నతాధికారుల విచారణలో రుజువు అయితే చర్యలు తప్పవంటున్నారు. ఏ పార్టీ అయినా సరే తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుపోతుందంటున్నారు. అవసరమయితే పీడీయాక్ట్ నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం అంటున్నారు.
Read Also: Lunar Eclipse: రేపు చంద్రగ్రహణం.. కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి?