Bhatti Vikramarka: సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నక్కలగండిలో పీపుల్స్ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలకు సిద్ధమైన భూ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన 2013 భూ నిర్వాసితుల చట్టంలో భూ నిర్వాసితులకు అన్ని సదుపాయాలు పొందు పర్చామన్నారు. రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల సమస్యలు ఉన్నాయని, భూ నిర్వాసితుడు మేము తెలంగాణలో ఉన్నామా, పాకిస్థాన్ లో ఉన్నామా అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియంత పాలన సాగుతుందని అన్నారు. మరో 5 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, కేసిఆర్, కేటీఆర్, హరీశ్ లు వారి తాత ముత్తాతలు కూడా ఆపలేరని నిప్పులు చెరిగారు.
Read also: రూట్ మార్చిన కేరళ కుట్టి.. అనుపమ సూపర్ హాట్ షో
కేసిఆర్ ఆలోచన పోయిందా, మెదడు పోయిందా అర్థం కావడం లేదు, రెవెన్యూ చట్టం మొఘలుల పాలన నుండి రూపాంతరం చెందుతు వస్తుందన్నారు. భూ రికార్డులను భద్ర పరిచే రెవెన్యూ చట్టాన్ని చిన్నాభిన్నం చేశాడని అన్నారు. కేసీఆర్ ధరణి పేరుతో భూ కుంభకోణానికి పాలడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలకులు గాడిదలు కాస్తున్నారా,కాంగ్రెస్ హయాంలో ఎసెల్బీసీ సొరంగం పనులు చేపట్టి 30 కిలో మీటర్లు చేపడితే బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో 2,3 కిలోమీటర్లు తొవ్వారని అన్నారు. నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సోయిలేని పాలకులు మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సొరంగం పనులు కనిపిస్తాయన్నారు. జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా మంత్రా దిష్టిబొమ్మనా, ఎందుకు కేసిఆర్ ను నల్గొండ ప్రాజెక్టుల గురించి అడగడం లేదని తెలిపారు.
రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్లకోసం తొమ్మిదేళ్ళ పాలనలో నల్గొండ జిల్లాకు ఒక్క ఏకరానికైన నీరు ఇచ్చారా, ఏమి సాధించారని సాగునీటి ఉత్సవాలు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పాలకులు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వద్ద ఫోటోలు దిగుతున్నారని మండిపడ్డారు. సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది? అంటూ ప్రశ్నించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్ గా గుత్తా ఏమి తెచ్చాడు, ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి, కేసిఆర్ ను కలవడానికి భయపడతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నల్గొండ జిల్లా నేతలు సీఎం పక్కన కూర్చుని ఇక్కడి సమస్యలు పరిష్కారం చేశేవారని, కానీ ఇప్పటి బీఆర్ఎస్ పాలకులు జిల్లా పరువు తీస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ ఏమి చేసింది, మీరు ఏమి చేసారో తేల్చుకుందాం రండి, నల్గొండ జిల్లా పర్యటనలో ఒక్కో రోజు మీది ఒక్కో కథ చెబుతా అంటూ సవాల్ విసిరారు.
మగవాళ్లకు ఈ అలవాట్లు ఉంటే.. ఆ విషయంలో వీక్ అయినట్లే