కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో దారుణంగా విఫలమైంది.

అనుపమ రంగస్థలం లాంటి కొన్ని సినిమాలు చేజేతులా వదిలేసుకోవడంతో ఈ అమ్మడు కెరీర్ అప్పుడే గాడి తప్పింది.

అనుపమకు అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు డజన్ సినిమాలు చేసింది కానీ.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా తెలియదు. 

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ కూడా కాదు. గ్లామర్ షో చేస్తున్నా.. ఈమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రావడం లేదు. 

దాంతో మరింత గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయిపోయింది అనుపమ. దానికి డీజే టిల్లు సీక్వెల్ నిదర్శనంగా నిలవనుంది. 

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది.

రెండు రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది. దానికి కారణం సిద్దు కాదు.. కారులో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 

ఆ ఫోటోలో కనిపిస్తున్న తీరును బట్టి అనుపమ సినిమాలో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఈ సినిమా తర్వాత అనుపమ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుందని నమ్ముతున్నారు ఆమె అభిమానులు. 

మరోవైపు ఈ కేరళ కుట్టి కూడా అవకాశాల కోసం హాట్ షోతో పాటు ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కూడా రెడీ అన్నట్టు సిగ్నల్స్ ఇచ్చేస్తుంది.

మరి ఈ తెగింపు అనుపమ కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.