Illegal Weapons in Telangana: తెలంగాణ వ్యాప్తంగా గన్ కల్చర్ విస్తరిస్తుంది. కూర్చొని పరష్కిరించుకునే రోజులు పోయాయి. వ్యవహారం తేలిపోవాలంటే గన్ చేతిలో వుండాల్సిందే. రౌడీషీటర్లు, నేరస్థులు పిస్తోళ్లు, రివాల్వర్లను వినియోగిస్తున్నారు. అయితే.. బెదిరింపులు, దోపిడీలు, అపహరణలు, హత్యలు, ఇవన్నీ చేయాలంటే గన్నులుండాల్సిందే. నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులూ స్థిరాస్తి సెటిల్‌మెంట్లకు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి రౌడీషీటర్లు, నేరస్థుల చేతుల్లోనే 80 శాతం వరకూ ఆయుధాలు ఉన్నాయి. ఈతుపాకులను రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. అయితే.. గతంలో కరడుగట్టిన నేరగాళ్ల వద్ద మాత్రమే ఇలాంటి ఆయుధాలు ఉపయోగించేవారు. ఇప్పుడు పాతబస్తీలో నేరస్థులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని కొందరు రియల్టర్లు, రౌడీషీటర్ల వద్ద అత్యాధునిక పిస్టళ్లు, తుపాకులు, రివాల్వర్లు రాజ్యమేలుతున్నాయి. వీరు ల్యాండ్ సెటిల్ మెంట్లు, రియల్ ఎస్టేట్ గొడవలు, బెదిరింపులకు పాల్పడెందుకు తుపాకులు వాడుతున్నారు.
మొన్న మాదాపూర్ లో ల్యాండ్ గొడవల కారణంగా ఇస్మాయిల్ పై మరో వర్గం కాల్పులు జరిపగా.. ఒకరు మృతి చెందారు. అయితే ఇదిలా వుంటే.. జీవన్ రెడ్డి హత్యకు కుట్రకు ఘటనలో నిందితుడు ప్రసాద్ 30 వేలకు తుపాకీ కొనుగోలు చేసినట్లు సమాచారం. గన్ కొనుగోలు కోసం నాందేడ్ వాసిని సంప్రదించిన చాటింగ్ బట్ట బయలైంది. తాజాగా మునుగోడు లో గన్ ఫైర్ కలకలం రేపింది.
మునుగోడు కాల్పుల ఘటన కు హైదరాబాద్ లింక్ లు వున్నట్లు ,అక్రమ సంబంధమే కాల్పులకు కారణంగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లింగస్వామి పై నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు తెగబడ్డారు. అయితే బాలకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే దీనికిగల కారణం లింగ స్వామి భార్య పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ సూపరి గ్యాంగ్ తో డీల్ చేసినట్లు విచారణలో తేలిందని సమాచారం.
అయితే ఇటువంటి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిపై కాల్పులు కలకలం రేపింది. హైదరాబాద్ పాతబస్తీ మోగాల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో ఆగస్టు 3న అఫ్సర్ అనే వ్యక్తి తన ఇంటి గోడ పై ఉన్న బల్లిని వెపన్ తో ఫైరింగ్ చేసాడు. దీంతో అక్కడే ఆడుకుంటున్న బాలుడు యూసుఫ్ ఆలీకి బుల్లెట్ భుజం క్రింద తగిలి గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని బహదూర్ పురా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించా వైద్యం అందించారు. బాలుడికి ఎటువంటి ప్రమాదం లేదని, ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం మేరకు మోఘల్ పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gorantla Madhav Video Call Leak Issue: గోరంట్ల మాధవ్ రాజీనామాకు టీడీపీ నేతల డిమాండ్..