Bhatti Vikramarka : విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారు..
- కాంగ్రెస్ విజయంపై ఓటర్లకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు
- ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారు
- అభివృద్ధి, సంక్షేమానికే ప్రజల మద్దతు
- 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం : భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ఓటర్ మహాశయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం , పీసీసీ తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అభివృద్ధికి, సంక్షేమానికి , విశ్వసనీయతకే ప్రాధాన్యత ఇస్తారని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రతిపక్షాలు గాలి కబుర్లు, కట్టుకథలతో అసత్య ప్రచారాలు చేశాయని ఆయన మండిపడ్డారు. లేనివి ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసిన వారికి, ఓటర్లు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని, వారి అసలు స్థానం ఏంటో చూపించారని ఎద్దేవా చేశారు.
Also Read
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఈ విజయం తమ ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. “ప్రజలు ఈ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిపాలనను భవిష్యత్తులోనూ అందిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ తీర్పు ఒక ఆమోదముద్ర అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి తాజా గణాంకాలను భట్టి వెల్లడించారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటికే 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయనడానికి ఈ భారీ విజయమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
Ragi Pittu: ఆడపిల్లలకి అమృతం లాంటి ఆహారం.. నెలలో 3 సార్లు ఇది తింటే నడుము నొప్పి, నీరసం పరార్!
తాజావార్తలు
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!