Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
- టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- మొత్తం 7 ఖాళీలు.. ఆకర్షణీయమైన వేతనం
- జూలై 15 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
- ఆగస్టు 22 వరకు అప్లై చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News : తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక మంచి వార్త చెప్పింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ (Town Planning Assistant) పోస్టుల భర్తీకి కమిషన్ తాజాగా జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీలు, జీతభత్యాల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేట్ లెవెల్ క్యాడర్లో 02 ఖాళీలు ఉండగా, మల్టీ జోనల్ క్యాడర్ పరిధిలో 05 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు ఆకర్షణీయమైన శాలరీ స్కేల్‌ను అందించనుంది.
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
విద్యార్హతలు , వయోపరిమితి
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విధిగా బి.ప్లానింగ్ (B.Planning) లేదా బి.టెక్ ప్లానింగ్ (B.Tech Planning) విద్యార్హతను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి , గరిష్టంగా 44 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు కూడా వర్తిస్తాయి.
దరఖాస్తు తేదీలు , అధికారిక వెబ్సైట్
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15 జూలై 2026 నుండి ప్రారంభం కానుంది. అర్హత , ఆసక్తి గల అభ్యర్థులు 22 ఆగస్టు 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి గడువు ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన విద్యార్హతలు, పరీక్ష విధానం , ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!