ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రధాని మోడీ అక్కసుతో మాట్లాడారు. అనేక ఇబ్బందులు తట్టుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మోడీ అలా మాట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా వున్నారు. ప్రతీ ఓటు ఇంపార్టెంట్ అనుకునే సమయంలో కూడా కేసీఆర్ పార్లమెంట్ కి పోలేదన్నారు.
మోడీ..దేశ ప్రధానిగా కాకుండా అక్కసుతో మాట్లాడారన్నారు. తెలంగాణపై మోడీకి ఉన్న అక్కసు ఈ మాటలతో బయటపడిందన్నారు భట్టి. బిల్లు పాస్ చేసేటప్పుడు.. తలుపులు మూసేసి ఓటింగ్ చేస్తారు. మోడీకి అది తెలియదు…. ఎప్పుడూ ఆయన అసెంబ్లీలోనే ఉన్నాడు కదా ? మోడీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే… నిన్నటి నుండి కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు.
ఎందుకు కేసీఆర్ బయటకు రావడం లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్… నువ్వుంటే ఇచ్చే వాడివి కాదు అని కేసీఆర్ చెప్పాలి. ప్రతీ ఓటు ఇంపార్టెంట్ అనుకునే సమయంలో కూడా కెసిఆర్ పార్లమెంట్ కి పోలేదు. తెలంగాణ ప్రజలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మాటల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు భట్టి. మోడీ మాటల్ని కేసీఆర్ ఖండించాలన్నారు. లేదంటే… మోడీ..కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకం అని నిర్ధారణ అవుతుందన్నారు.