Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జాతీయ స్థాయి CA విద్యార్థుల సదస్సులో భాగంగా ముఖ్యోపన్యాసం ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. “CA అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది జాతి నిర్మాణంలో భాగస్వామ్యం. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతను చార్టెడ్ అకౌంట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు,” అని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ, “మీ నిజాయితీయే మీ అత్యంత విలువైన ఆస్తి. టెక్నాలజీ, ఆటోమేషన్ వేగంగా మారుతున్న ఈ యుగంలో నైతికతకు కట్టుబడి ఉండే అవసరం మరింత పెరిగింది. మీరు చేసే ప్రతి పని నిజాయితీ, సమన్యాయం, బాధ్యతను ప్రతిబింబించాలి,” అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
Delhi: ఢిల్లీలో అక్రమ కట్టడాలు కూల్చివేత.. బీజేపీ పేద వ్యతిరేకి అంటూ అతిషి ధ్వజం
భవిష్యత్ తెలంగాణను ప్రపంచ పటంలో నిలపాలనే లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం అనేక మేగాపథకాలపై దృష్టిసారించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యంగా, హైదరాబాద్‌ను చార్టెడ్ అకౌంట్లకు ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. “ఇక్కడ AI పార్క్‌ను ఏర్పాటు చేయనున్నాం. IT, ఫార్మా, టెక్స్టైల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్‌ల ద్వారా హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం,” అని వివరించారు.
“తెలంగాణ ఈ రోజు దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది. రీజినల్ రింగ్ రోడ్, మూసీ రివైటలైజేషన్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల వంటి యోచనలతో తెలంగాణ అభివృద్ధిలో మైలురాళ్లుగా నిలుస్తోంది,” అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు భట్టి విక్రమార్క జ్ఞానాన్ని, నైతికతను రెండు చేతుల్లో పట్టుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చార్టెడ్ అకౌంట్ల కృషి తెలంగాణ రైజింగ్ లో భాగస్వామ్యం కావాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్లేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
DMK Govt Erasing Hindu: కుల ధృవీకరణ పత్రాల నుంచి ‘హిందూ’ అనే పదాన్ని డీఎంకే సర్కార్ తొలగిస్తుంది..