రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా, ఈ విజన్ పాలసీ లక్ష్యాలు, ప్రణాళికలపై ఆయన కీలక వివరాలను వెల్లడించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “తెలంగాణను 2037 వరకు 1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తక్షణ లక్ష్యం. అలాగే, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే…
ఇక, సౌర శక్తి ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మహిళా సంఘాలకు ఇవ్వడానికి సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాఠశాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ, 7 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో తీసుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉచిత బస్ ప్రయాణం ఎందుకు ఇస్తున్నారు అని విమర్శిస్తున్నారు.
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జాతీయ స్థాయి CA విద్యార్థుల సదస్సులో భాగంగా ముఖ్యోపన్యాసం ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. “CA అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది జాతి నిర్మాణంలో భాగస్వామ్యం. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతను చార్టెడ్ అకౌంట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు,” అని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ, “మీ నిజాయితీయే మీ అత్యంత విలువైన ఆస్తి. టెక్నాలజీ, ఆటోమేషన్…
KTR : డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 14 ఏళ్ల కఠిన పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలోనే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిన ఘనత గురించి ఆయన గర్వంగా చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఇంజన్‌గా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి…
సభలో కాగ్ నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. కాగ్ నివేదిక ప్రకారం.. 2023-24 బడ్జెట్ అంచనా రూ. 2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ. 2,19,307 కోట్లు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం లభించింది..
KTR : తెలంగాణలో ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిశ్రమలు నాశనం అవుతున్నాయని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊసేలేకుండా ఉండటం విచారకరమని తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్లో ప్రధానంగా బయ్యారంలోని ఉక్కు పరిశ్రమ స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మరోవైపు, ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని…
Bandi Sanjay : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే…డొల్ల అని తేలిపోయింది. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే…
Harish Rao : మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా, పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగాన్ని విమర్శిస్తూ, అది బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలా మారిపోయిందని అన్నారు. హరీష్ రావు ప్రకారం, బడ్జెట్లో పేర్కొన్న అనేక విషయాలు నిజాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా, వడ్డీ లేని రుణాల…
MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర సమస్యలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై, అలాగే ఇతర సమస్యలపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ పేగులు తెగేలా పోరాడిందని, అప్పటి కష్టం మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ పోరాటంలో కొంతమందికి…