రేపటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ మేథోమధన సదస్సు, శింతన్ శిబిర్ పేరిట కీసరలో సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరగబోతున్న కాంగ్రెస్ సమావేశాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క స్పందించారు. వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా కొందరు అందుబాటులో ఉంటారు.. కొందరు ఉండరని ఆయన అన్నారు. వ్యక్తుల కోసం వ్యవస్థ, సంస్థల కార్యకలాపాలు ఆగవని బట్టి అన్నారు. సంస్థ నిర్ణయాలకు అనుగుణంగా జరుగుతుంది.. దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.
రేపటి నుంచి మేధోమదన సమస్సు నిర్వహిస్తున్నట్లు.. తెలంగాన లక్ష్యాలను నేరవేర్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇది ఏఐసీసీ నిర్వహిస్తున్న సమావేశం అని అన్నారు. రాష్ట్రం పరిధి దాటి అప్పు చేసిందని.. రాష్ట్ర ఆదాయం మొత్తం అప్పులు కట్టడానికి పోతుందని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మేము గత ఐదేళ్ల నుంచి ఇదే చెబుతున్నామని తెలిపారు.
ప్రధాని మోదీ కూడా దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు బట్టి. దేశాన్ని దివాళా తీయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లేకుండా.. బ్యాంకులకు గ్యారెంటీలు ఇస్తున్నారని.. పరపత పోయింది అప్పు కూడా దొరకడం లేని అన్నారు. అంతిమంగా రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి వస్తుందని అన్నారు. గతంలో మేము చెప్తే తెలంగాణ ఇప్పుడే పుట్టిన బిడ్డ.. బుడి బుడి అడుగులు వేస్తుందని టీఆర్ఎస్ చెప్పిందని.. ఇప్పుడేమో అప్పులు రావడం లేదని చెబుతోందని విమర్శించారు.
.