భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించిన అధికార పార్టీలో కౌన్సిలర్ లు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి కాపు సీత మహాలక్ష్మినీ దించేయాలని ఒక వర్గం చైర్మన్ పదవిని కాపాడుకోవడం కోసం ఒక వర్గం రెండు వర్గాలు తీర్థయాత్రలకు బయలుదేరారు. తీర్థయాత్రలకు వెళ్లిన చోట కౌన్సిలర్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏకంగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి తమ కౌన్సిలర్లతో కలిసి డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ కి అందినవి. కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికైన దగ్గర నుంచి విభేదాల నడుమనే కొనసాగుతుంది. చైర్ పర్సన్ కాపు సీత మహాలక్ష్మికి వ్యతిరేకంగా ప్రత్యర్థులు మొదటి నుంచి పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. కాపు మహాలక్ష్మి పదవి నుంచి తొలగించటం కోసం నిరంతర ప్రయత్నాలు సాగాయి. కౌన్సిల్ ఎన్నికై మూడు సంవత్సరాలు అయిన నేపథ్యంలో కాపు సీతా మహాలక్ష్మినీ తొలగించటం కోసం ఒక వర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : Thatikonda Rajaiah : అభివృద్ధి పథకాలు కేసీఆర్ అందిస్తూ ఉంటే, నేను మీకు పంచి పెడుతున్న
ఇందులో భాగంగానే కాపు వర్గం కు చెందిన కౌన్సిలర్లు తీర్థయాత్రకు వెళ్లారు. అయితే కాపు మహా కాపు సీతామాలక్ష్మి తొలగించడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుండగా తనని తాను చైర్పర్సన్ పదవి నుంచి కాపాడుకునేది కోసం సీతామహాలక్ష్మి వర్గం కూడా తీర్థయాత్రలకు వెళ్లింది. తీర్థయాత్రలో కాపు సీత మహాలక్ష్మి వేస్తున్న డాన్సులు ఇప్పుడు మనం చూడవచ్చు. గూడెం మున్సిపాలిటీ లో 36 వార్డులు వున్నాయి. తమ వర్గాన్ని రక్షించుకునేది కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. నిన్న మొన్నటివరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర తో కాపు సీతామాలక్ష్మికి విభేదాలు ఉండేవి. అయితే గత కొంతకాలంగా ఈ విభేదాలు సమస్య పోయాయి .వనమా వెంకటేశ్వరరావు సీతామహాలక్ష్మికి మద్దతు ఇస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రత్యర్థి శిబిరం బలంగా తయారవుతుంది.
ఇది ఇలా ఉంటే ఒకవైపు సీతామహాలక్ష్మి వర్గం తీర్థయాత్రలకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ గా ఉండగా మరోవైపున ఆమె ప్రత్యర్థులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన టెండర్ల వ్యవహారంలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ వద్ద సీతా మహాలక్ష్మి ప్రత్యర్థులు తమ నిరసనగలం విప్పి ధర్నా నిర్వహించారు దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీ అధికార పార్టీ వ్యవహారం అంతా ఇప్పుడు రోడ్డున పడింది.