గతకొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య కోల్డ్ వార్ సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. వీరిద్దరి మధ్య వార్ కన్ఫర్మే అన్నట్లుగా రాజయ్య, శ్రీహరిలు పరోక్షంగా విమర్శలు సంధించుకుంటున్నారు. తాజాగా మరోసారి కడియం టార్గెట్‌గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కామెంట్స్ చేశారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. నేను అడగకుండానే నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నేను రుణపడి ఉన్నాన్నారు. గత 13 సంవత్సరాల నుండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ప్రజల మధ్యలో ఉంటున్నానన్నారు.
Also Read : Jammu & Kashmir Snowfall : జమ్మూలో హిమపాతం.. మూసుకుపోయిన శ్రీనగర్-లేహ్ రోడ్డు
నియోజకవర్గ అభివృద్ధికి నా ఇంట్లో నుండి నిధులు పెట్టడం లేదని, ప్రజలు పన్నుల రూపంలో మనం కట్టిన డబ్బులను మాత్రమే అభివృద్ధికి ఉపయోగిస్తున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. అభివృద్ధి పథకాలు కేసీఆర్ అందిస్తూ ఉంటే, నేను మీకు పంచి పెడుతున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి నేను చేసిన అని చెప్పుకోవడం అంతకన్నా మూర్ఖత్వం ఉండదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొందరు నాయకులను ప్రజలు మర్చిపోతుంటే గాయి గాయి అవుతున్నారని, పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను మాట్లాడటం సరైనది కాదని ఆయన అన్నారు.