Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danam Nagender: దానం నాగేందర్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. పిటిషన్‌ను విచారించాలని నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించగా, హై కోర్టు విచారించి అనర్హతా వేటు వేసిందని వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అందువల్ల అత్యవసరంగా విచారించాలని కోరారు. బుధవారం నాడు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
పార్టీ ఫిరాయించారన్న కారణంతో తనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ తీర్పు వెలువడిన వెంటనే తనకు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలేదని తొలుత చెప్పిన దానం.. శనివారం మధ్యాహ్నం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదిగా బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని పేరా 2(1)(ఎ) రెడ్ విత్ ఆర్టికల్ 191(2)కింద తనను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎమ్మెల్యే అనర్హత విషయంలో స్పీకర్ తీసుకొనే నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించడానికి వీల్లేదన్నది పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
తాజావార్తలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!