Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కృతి శెట్టి ‘దీపు’ అనే పాత్రలో సందడి చేయబోతోంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లో హాఫ్ శారీలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన కృతి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
“నీ ఎనర్జీ, అమాయకత్వం, ఫ్రెష్‌నెస్ ఈ సినిమాకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చాయి” అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్ బయటికి వచ్చిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్‌లోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.80 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘జీ5’ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి బ్రాండ్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ స్థాయి జాక్‌పాట్ డీల్ కుదిరిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరో ప్రధాన హీరోయిన్గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Happy Birthday, DEEPU @IamKrithiShetty 😉🤗🥳
It has been wonderful watching you bring so much energy, innocence and freshness to #January12Vidudala with your performance.
Wishing you an amazing year ahead ✨ pic.twitter.com/6wAhf70h9L
— Anil Ravipudi (@AnilRavipudi) September 21, 2026
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!